Friday, 8 May 2020

లాక్‌డౌన్ టైమ్: సొంత పొలంలో హాట్ హీరోయిన్.. అలా కనిపించడంతో!! వైరల్ వీడియో

కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలంతా తమకు తోచిన విధంగా వాడుకుంటున్నారు. కొందరు ఛాలెంజ్‌ల పేరిట అందాల ఆరోబోత చేస్తుంటే.. మరికొందరు కిచెన్‌లో వంటకాలు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో అభిమానులతజో టచ్ లోకి వస్తూ తమ తమ్ కెరీర్ తాలూకు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. అయితే అందరిలోనూ తాను డిఫరెంట్ అని చాటుకుంటూ పొలం పనుల్లో నిమగ్నమై ఆశ్చర్యపరిచింది యంగ్ హీరోయిన్ . కెమెరా ముందు అందాల విందు చేయడమే కాదు.. పొలంలో దిగి వ్యవసాయ పనులు కూడా చేయగలం అని చూపిస్తూ నేటితరం హీరోయిన్లందరికీ ఆదర్శంగా నిలిచింది. అచ్చం పల్లెటూరి పడుచుపిల్లలా పొలంలోకి దిగి ఆమె నాటు పెడుతున్న విధానం చూసి వావ్! అంటున్నారు నెటిజన్స్. ఈ వీడియోను తనే స్వయంగా షేర్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరీ కీర్తి పాండియన్ అనే కదా మీ సందేహం. ప్రముఖ న‌టుడు అరుణ్ పాండియ‌న్ కుమార్తెనే హీరోయిన్ కీర్తి పాండియన్. తమిళ సినిమా 'తుంబ' ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం విలన్‌ అనే మలయాళ చిత్ర తమిళ రీమేక్‌‌లో నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ రావడంతో సొంతూరు వెళ్లి రైతు అవతారమెత్తింది ఈ హాట్ హీరోయిన్. సొంత పొలంలో నాటేస్తూ, టాక్టర్ డ్రైవ్ చేస్తూ ఫుల్ హంగామా చేసింది. కీర్తి వీడియో చూసి నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు. అంతేకదా.. ఓ హీరోయిన్ పొలంలో దిగి నాటేయడం అంటే నిజంగా అభినందించదగిన సంగతే మరి!. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yEBboz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...