Monday, 25 May 2020

చిరంజీవి చిన్న కూతురి చపాతి ఛాలెంజ్.. మొదట బలైంది భర్తే!

సాధారణంగా చపాతీలు గుండ్రంగానే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా చపాతీలను గుండ్రంగా చేయకపోతే మనం వెక్కిరిస్తాం కూడా. ఇలానేనా చపాతీలు చేసేది అంటూ నిట్టూరుస్తాం. కానీ, చపాతీలు గుండ్రంగానే ఎందుకుండాలి అంటున్నారు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్. చపాతీలు గుండ్రంగా ఉండాల్సిన అవసరం లేదని, టేస్టీగా ఉంటే చాలని అంటున్నారు ఈ దంపతులు. రకరకాల ఆకారాల్లో చపాతీలను చేయండంటూ నెటిజన్లకు ఛాలెంజ్ విసిరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక కొత్త ఛాలెంజ్‌కు తెర తీశారు. Also Read: లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న కళ్యాణ్ దేవ్ తన భార్య శ్రీజ కోసం చపాతీలు ప్రిపేర్ చేశారు. అయితే, ఆ చపాతీలు రకరకాల ఆకారాల్లో వచ్చాయి. వాటిని చూసిన శ్రీజ.. ‘‘లాక్‌డౌన్ వల్ల ప్రయాణాలు చేయలేకపోవచ్చు.. కానీ కళ్యాణ్ ఇప్పటికీ నన్ను ఆస్ట్రేలియా, ఆఫ్రికా తీసుకెళ్తున్నారు’’ అని సరదాగా అన్నారు. ఈ మేరకు ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు, నెటిజన్లు కూడా రకరకాల ఆకారాల్లో చపాతీలు చేసి వాటి ఫొటోలను తమతో షేర్ చేసుకోవాలని సూచించారు. Also Read: #WhyShouldAllChapatisBeRound హ్యాష్‌టాగ్‌తో రకరకాల ఆకారాల చపాతీల ఫొటోలను షేర్ చేస్తే వాటిలో తమకు నచ్చిన చపాతీల ఫొటోలను తమ స్టోరీల్లో పోస్ట్ చేస్తామని శ్రీజ, కళ్యాణ్ దేవ్ చెప్పారు. అయితే, తప్పకుండా కళ్యాణ్ దేవ్ (@kalyaan_dhev)ను ట్యాగ్ చేయాలని సూచించారు. కాగా, అన్నపూర్ణ ఆట ప్రమోషన్‌లో భాగంగా ఈ వీడియోను చేశారు శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు. ఇదిలా ఉంటే, ‘విజేత’ సినిమాతో హీరోగా వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన కళ్యాణ్ దేవ్.. ప్రస్తుతం ‘సూప‌ర్ మ‌చ్చి’ అనే సినిమా చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gp5OQe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...