Tuesday, 5 May 2020

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ కొట్టేసిన దొంగలు

తెలుగులో బంగారం, వాన, గ్రీకువీరుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మీరా చోప్రా. ఈ భామ తాజాగా బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా తన తండ్రి ఫోన్ దొంగతనానికి గురై విషయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాకింగ్ వెళ్లినప్పుడు తన తండ్రి ఫోన్‌ను ఇద్దరు దుండగులు బెదిరించి ఎత్తుకెళ్లారని తెలిపింది. ఢిల్లీలోని పోలీస్‌ కాలనీలో ఈ ఘటన జరిగిందని ఆమె పేర్కొంది. ఎంతో సురక్షిత ప్రాంతమని చెప్పుకుంటున్న ఢిల్లీలోనే ఇలాంటి ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. మీరా చోప్రా తన ట్వీట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ , ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ట్యాగ్‌ చేశారు. దీనిపై ఉత్తర ఢిల్లీ డీసీపీ స్పందించారు. మరిన్ని వివరాలు అందించాలని కోరారు. పీసీఆర్‌ పోలీస్‌ లేన్‌, మోడల్‌ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్‌ రోడ్డులో ఈ చోరీ జరిగిందని మీరా చోప్రా సమాధానం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కొందరు నెటిజన్స్ మీరా చోప్రా చేసిన ట్వీట్ పై స్పందించారు. లాక్ డౌన్ వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. అలాంటి వారి వల్ల నేరాలు పెరిగే అవకాశం ఉందని... అందుకే రానున్న రోజుల్లో మనమంతా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనిపై మీరా చోప్రా అవును అది నిజమేనంటూ సమాధానం ఇచ్చింది. మీరా చోప్రా తాజాగా హిందీలో సెక్షన్‌ 375 సినిమాలో కీలక పాత్ర పోషించారు. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. సినిమా షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న విషయం పరిశ్రమలో ఎవరికి తెలియడం లేదన్నారు చోప్రా. మీరా చోప్రా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు బంధువు కూడా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L3iuO3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...