Friday, 15 May 2020

భార్యకు విడాకులు.. లేడీ సింగర్‌తో డేటింగ్.. అసలు విషయం బయటపెట్టిన గోపీ సుందర్

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ సంగతులు, విడాకుల మ్యాటర్స్ తరచుగా వింటూనే ఉంటాం. నిత్యం ఎవరో ఒకరికి సంబంధించిన ఎఫైర్ బయటపడుతూనే ఉంటాయి. కాకపోతే ఇలాంటి ఎఫైర్స్ ఎక్కువగా నటీనటుల మధ్య చూస్తుంటాం. కానీ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. 19 సంవత్సరాల క్రితం ప్రియ అనే యువతిని పెళ్లాడిన గోపిసుందర్.. కొన్నేళ్ల పాటు తన దాంపత్య జీవితాన్ని కొనసాగించి చివరకు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. గోపీ సుందర్- ప్రియ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ విడాకుల కోసం అప్లై చేశారు. ఆ తర్వాత యువ గాయని అభయ హిరన్మయితో గోపీ సుందర్ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై స్పందిస్తూ తాను సహజీవనం చేస్తున్న మాట వాస్తవమే అని చెప్పారు గోపీ సుందర్. 'నా ఉనికికి కారణం నువ్వే' అని పేర్కొంటూ హిరన్మయితో కలిసి దిగన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసి అసలు విషయం చెప్పేశారు గోపీ సుందర్‌. దీంతో ఈ పోస్ట్ నెట్టింట హాట్ ఇష్యూగా మారింది. వీరిద్దరూ గత తొమ్మిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. Also Read: తెలుగు, తమిళ, మళయాళ భాషల్లోని సినిమాలకు బాణీలు కట్టి మంచి గుర్తింపు పొందారు మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్. తెలుగులో ఆయన కంపోజ్ చేసిన 'గీతా గోవిందం' సినిమా పాటలు అందరినీ ఆకర్షించాయి. ప్రస్తుతం పలు సినిమాలకు బాణీలు కడుతూ బిజీ లైఫ్ గడుపుతున్నారు గోపీ సుందర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bB9Cde
v

No comments:

Post a Comment