Saturday, 23 May 2020

నాగబాబు జబర్దస్త్ ప్లాన్‌.. గట్టి దెబ్బకొట్టేలా రంగంలోకి! స్కెచ్ అదిరిందిలే..

నేటితరం బుల్లితెర ఆడియన్స్ వినోదభరితమైన కార్యక్రమాలకే పెద్ద పీట వేస్తున్నారు. కుటుంబమంతా కలిసి చిన్నితెర ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బుల్లితెర ఛానల్స్, ప్రోగ్రామ్స్ మధ్య పోటీ పెరుగుతూ వస్తోంది. పలు టీవీ ఛానల్స్ తమ తమ షోస్ ద్వారా భారీ టీఆర్ఫీ సాధించి మొదటిస్థానంలో నిలవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాను జడ్జిగా వ్యవహరిస్తున్న '' షో కోసం ఓ మెగా ప్లాన్ రెడీ చేశారట మెగా బ్రదర్ . ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే దాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారట. గత ఏడేళ్లుగా బుల్లితెరపై హవా సాగిస్తోంది జబర్దస్త్ ప్రోగ్రాం. జడ్జుల స్థానంలో నాగబాబు, రోజా.. యాంకర్లుగా అనసూయ, రష్మీ మ్యాజిక్ చేస్తూ భారీ టీఆర్ఫీ సాధించారు. అయితే ఇటీవలే నాగబాబు జబర్దస్త్ వీడి 'అదిరింది' ప్రోగ్రాం లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అచ్చం జబర్దస్త్ ఫార్మాట్ లోనే ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి వినోదాల విందిస్తున్నారు. మొదట్లో జబర్దస్త్ రేంజ్‌లో ఆకర్షించని ఈ ప్రోగ్రాం, మెల్లగా పుంజుకుంటోంది. ఈ పరిస్థితి గమనించిన నాగబాబు ఈ ప్రోగ్రాం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట. ఈ ప్లాన్ అమలు చేస్తే ఇక జబర్ధస్త్‌కు కష్టాలే అనే టాక్ వినిపిస్తోంది. Also Read: ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, యూట్యూబ్‌లో భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్న తరుణంలో కరోనా వైరస్ ‘అదిరింది’ షోను దెబ్బకొట్టింది. షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే లాక్‌డౌన్ ఫినిష్ అయ్యే సమయం దగ్గరపడటంతో ఈ షో డోస్ మరింత పెంచాలని డిసైడ్ అయ్యారట నాగబాబు. ఇకపై జబర్ధస్త్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు రేటింగ్‌ను మెరుగు పర్చుకోవడానికై వారానికి రెండు రోజులు ప్రసారం చేయాలని 'అదిరింది' మేనేజ్‌మెంట్‌ని కోరారట. దీంతో.. ఒకవేళ ఇదే జరిగితే టీఆర్ఫీ పరంగా జబర్ధస్త్‌ షోకు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జబర్ధస్త్ కూడా వారంలో రెండు రోజులు ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. సో.. చూడాలి మరి ముందు ముందు జబర్దస్త్ రోజాతో పోటీపడి నాగబాబు అదిరింది అనిపిస్తాడా? లేదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ysxoe2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...