Tuesday, 5 May 2020

క్రికెటర్‌తో తమన్నా ఎఫైర్! ఇదిగో సాక్ష్యం.. అసలు మ్యాటర్ చూస్తే..

పెరిగిన టెక్నాలజీ, దానికి తోడు సోషల్ మీడియా కొత్తపుంతలు తొక్కుతుండటం కొన్ని సందర్భాల్లో అనవసర చిక్కులు తెస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఎఫైర్ తాలూకు విషయాలు ఇట్టే వైరల్ అవుతుండటం వాళ్లకు తలనొప్పిగా మారింది. ఓ హీరోయిన్ బయట ఎవరితో అయినా కనిపిస్తే చాలు నిజానిజాల సంగతి పక్కనబెట్టి రూమర్స్ అంటగడుతున్నారు గాసిప్ రాయుళ్లు. కనీసం ఆ పిక్ ఎక్కడిది? ఎప్పటిది? అని కూడా చూడకుండా ఒక్క క్లిక్‌తో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సందర్భమే ఎదుర్కొన్న .. దానిపై ఘాటుగా రియాక్ట్ అయింది. పాకిస్తాన్ క్రికెటర్‌తో కలిసి తమన్నా షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ పిక్ ఇప్పటిది కాదు. అప్పట్లో దుబాయ్‌లో ఓ బంగారం షాపు ప్రారంభోత్సవానికి పాకిస్థానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైనప్పటిది. ఆ సమయంలో తీసిన ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టేసి.. తమన్నా ప్రేమలో పడింది, పెళ్లి కూడా చేసుకోబోతోంది. అందుకే బంగారం కొనేందుకు వెళ్ళిందంటూ ప్రచారం స్టార్ట్ చేశారు. దీంతో ఈ ప్రచారంపై రియాక్ట్ అయిన తమన్నా.. ఇలాంటి వెర్రి పుకార్లను ఆపాలని, నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వైరల్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఎవరితో ఎలాంటి ఎఫైర్ లేదని, మరో రెండేళ్లలో తాను పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని తమన్నా పేర్కొంది. తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకున్న తమన్నా.. అందరు అగ్ర హీరోల సరసన నటించింది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో పార్టీ సాంగ్ చేసి హోరెత్తించింది. ప్రస్తుతం ఆమె గోపిచంద్ సరసన సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సీటిమార్' సినిమాలో నటిస్తోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2z9F70A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...