Thursday, 7 May 2020

విశాఖలో భయానక ఘటన.. కలచివేస్తున్న దృశ్యాలు.. ఎన్టీఆర్ రియాక్షన్

విశాఖ పరిశ్రమ దుర్ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. విశాఖపట్నంలో ఈ రోజు (మే 7) తెల్లవారు జామున జరిగిన విష వాయువు ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. కేంద్రం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అన్నిరకాల సహాయ సహకారాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అర్థరాత్రి సమయంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ఒక్కసారిగా విష వాయువు లీక్ కావడంతో ఆ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి వాతావరణంలో విషపూరిత గ్యాస్ కలవడంతో జనం ఊపిరాడక చనిపోతున్నారు. ఇప్పటికే 10 మంది మరణించగా.. దాదాపు 2వేలకు మందికిపైగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అక్కడి దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. కాగా ఈ దారుణ ఘటనపై సినీ తారలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విశాఖ దుర్ఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటున్నారు. తాజాగా యంగ్ టైగర్ ట్వీట్ చేస్తూ.. ''వైజాగ్ గ్యాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వైజాగ్ ప్రజలు ధైర్యంగా ఉండండి'' అని పేర్కొన్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dpGmaY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...