చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న సీనియర్ నటి వాణి శ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ కార్తీక్, మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మరణించారనే వార్త నుంచి తేరుకోకముందే మరో యువ నటుడు కన్నుమూశారనే వార్త చిత్ర వర్గాలను కలవరపెడుతోంది. నిన్న (శనివారం) బాలీవుడ్ యువ నటుడు మోహిత్ బఘేల్ (26) క్యాన్సర్‌తో మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న మోహిత్ బఘేల్.. శనివారం ఉదయం తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో మరణించినట్టు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య పేర్కొనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్ బారినపడిన మోహిత్ గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడని, ఈ నెల 15న అతడితో మాట్లాడానని అన్నాడు రాజ్ శాండిల్య. అప్పుడు బాగానే ఉన్న మోహిత్ మరణవార్త తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నాడు. మోహిత్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Also Read: రియాలిటీ షో చోటే మియాన్‌తో కెరీర్ ఆరంభించిన మోహిత్ బఘేల్.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘రెడీ’ సినిమాలో నటించాడు. సిద్దార్థ్ మల్హోత్రా, పరిణితీ చోప్రా జంటగా నటించిన జబారియా 'జోడి' చిత్రంలో కూడా మోహిత్ నటించాడు. ఆయన మరణం బాలీవుడ్ వర్గాల్లో విషాదఛాయలు నింపేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xqycsd
v
No comments:
Post a Comment