Tuesday, 19 May 2020

ఎన్టీఆర్ అన్‌సీన్ పిక్: రొమాంటిక్.. బర్త్‌డే గిఫ్ట్ అదిరింది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేపు (మే 19న) పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. రేపు ఆయన 37వ ఏట అడుగుపెట్టబోతున్నారు. ప్రతి ఏటా ఆయన పుట్టినరోజును అభిమానులో ఎంతో ఘనంగా నిర్వహించుకునేవారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టేవారు. కానీ, ఈసారి ఆ అవకాశం లేదు. తన పుట్టినరోజు వేడుకలను జరపవద్దని, అభిమానులంతా భౌతిక దూరం పాటించి సురక్షితంగా ఉండాలని ఎన్టీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే, ఈ పుట్టినరోజు నాడు ‘RRR’ మూవీ నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని అభిమానులు భావించారు. కానీ, వారికి నిరాశే మిగిలింది. లాక్‌డౌన్ వల్ల ఎన్టీఆర్ ఫస్ట్‌ లుక్, టీజర్ చేయడం వీలుపడలేదని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ప్రకటించింది. అయితే, అభిమానులు కాస్త నిరాశతో ఉన్న ఈ సమయంలో ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఒక ఇమేజ్‌ను ట్వీట్ చేశారు. ఈ ఫొటోను ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. ఎన్టీఆర్ పుట్టినరోజును పురష్కరించుకుని ఈ ఇమేజ్‌ను అభిమానులకు అందించారు లాయిడ్. అయితే, ఇది ‘అరవింద సమేత’ సినిమా సమయంలోనిది అని అర్థమవుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు లాయిడ్ ట్రైనర్‌గా ఉన్నారు. కాగా, లాయిడ్ ట్వీట్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు తారక్. ఈ లుక్‌ను చూసి ఎన్టీఆర్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. అరాచకం.. ఇది చాలు అంటున్నారు. ఈ ఫొటోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ దబ్బూ రత్నాని తీశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZkADiW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...