Monday, 18 May 2020

ప్రొడక్షన్ వ్యాన్‌లోనే బట్టలు మార్చుకున్నా: లావణ్య త్రిపాఠి

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన లావణ్య.. ఆ తరవాత ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అర్జున్ సురవరం’ వంటి మంచి చిత్రాలతో ఆడియన్స్‌కి బాగా దగ్గరైపోయారు. అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు. Also Read: ఇదిలా ఉంటే, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో ప్రస్తుతం లావణ్య ఇంట్లోనే ఉంటున్నారు. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. అయితే, సోమవారం ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. సాయంత్రం 6 గంటల నుంచి గంటపాటు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఆమె ట్విట్టర్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రారంభించిన వెంటనే ఒక నెటిజన్ చాలా తెలివైన ప్రశ్న అడిగాడు. ‘‘మీ మొట్టమొదటి సినిమా షూటింగ్‌లో మీకు ఎదురైన పరిస్థితులు ఏంటి?’’ అని అడిగాడు. See Photos: ఈ ప్రశ్నకు లావణ్య స్పందిస్తూ.. ‘‘చాలా ఉన్నాయి. ఆ సినిమా బడ్జెట్ చాలా తక్కువ. కాబట్టి మాకు కారావ్యాన్స్ లేవు. ప్రొడక్షన్ వ్యాన్‌లో బట్టలు మార్చుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది’’ అని వెల్లడించారు. ఇంకా నెటిజన్లు అడిగిన ప్రశ్నలు, ఆమె చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి. ✦ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి. అన్ని విషయాలపై స్పందించే ఆయన ధైర్యం మీద నాకెంతో గౌరవం. అసలు సిసలు హీరో. ✦ రామ్ చరణ్ సినిమాల్లో మీకు ఇష్టమైనది ఏది? ఆయనో అద్భుతం. ‘రంగస్థలం’ అంటే నాకు చాలా ఇష్టం. ✦ నేచురల్ స్టార్ నాని గురించి ఒక్క మాటలో చెప్పండి. నాకు ఇష్టమైన సహ నటుల్లో ఆయన ఒకరు. ✦ మీ చిన్నతనంలో మీకు నచ్చిన కార్టూన్ క్యారెక్టర్ ఏది? టామ్ అండ్ జెర్రీ ✦ డార్లింగ్ ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పండి. కూలెస్ట్ ✦ మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పండి. ఆయన్ని ఆరాధిస్తాను. ఆయన చాలా మంచి వ్యక్తి. దయ, ఎంతో వినయం కలిగిన వ్యక్తి. ✦ ఈ లాక్‌డౌన్ సమయంలో మీరు ఎక్కువగా ఏం చేస్తున్నారు? వండటం, తినడం.. మళ్లీ అదే చేయడం ✦ మీరు నటిగా మారడానికి మీకు స్ఫూర్తి ఎవరు? శ్రీదేవి మేడమ్, మాధురి దీక్షిత్ ✦ కింగ్ నాగార్జున గురించి ఒక్క మాటలో చెప్పండి. లివక లైఫ్ కింగ్ సైజ్. సారీ, ఒక్క మాట కన్నా ఎక్కువైంది. ✦ మీకు ఇష్టమైన షారుఖ్ ఖాన్ సినిమా ఏది? చక్ దే ఇండియా ✦ మీ ఫేవరేట్ స్పోర్ట్ ఏది? బ్యాడ్మింటన్ ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు హాకీని కూడా ఇష్టపడుతున్నాను. ✦ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ ఫస్ట్ లుక్‌పై మీ అభిప్రాయం ఏంటి? చంపేసింది. ఆయనకు మరో బ్లాక్ బస్టర్‌లా అనిపిస్తోంది. ✦ మీకు ఇష్టమైన తమిళ నటుడు ఎవరు? చాలా మంది ఉన్నారు. కానీ, విజయ్ సేతుపతి అంటే చాలా ఇష్టం. ✦ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పండి. ఆయన ఎనర్జీ అన్‌మ్యాచబుల్. మనందరం ‘RRR’ సినిమాలో ఆయన లుక్ కోసం వేచి చూస్తున్నాం. ✦ మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీరు మీ డ్రీమ్ రోల్‌ను ప్లే చేశారా? డ్రీమ్ రోల్ గురించి నాకు తెలీదు. కానీ, ‘చావు కబురు చల్లగా’లో ఒక మంచి పాత్ర చేయబోతున్నాను. ✦ తెలుగులో రాబోయే మీ సినిమాలు ఏంటి? చావు కబురు చల్లగా, ఎ1 ఎక్స్‌ప్రెస్‌. అలాగే, ఒక తమిళ సినిమా చేస్తున్నాను. ✦ రవితేజ గురించి ఒక్క మాటలో చెప్పండి. ఫన్నీయస్ట్ ✦ కీర్తి సురేష్ గురించి ఒక్క మాటలో చెప్పండి. అద్భుతమైన నటి ✦ దిగ్గజ నటుడు బ్రహ్మానందం గారి గురించి ఒక్క మాటలో చెప్పండి. నార్త్‌లో మోస్ట్ ఫేమస్ యాక్టర్ కావచ్చు. గిఫ్ట్ కింగ్ ✦ వరుణ్ తేజ్ గురించి చెప్పండి. సూపర్ టాలెంటెడ్ ✦ సమంత గురించి ఏమైనా చెప్పండి. ఆమె చాలా మందికి స్ఫూర్తిదాయకం. తనకు తానే పోటీ. అద్భుతమైన నటి, అలాగే గొప్ప మహిళ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/368mO8m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...