Wednesday, 13 May 2020

ఇంట్లో బాక్సింగ్ బ్యాగ్‌ను చితక్కొట్టేస్తున్న వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ బాక్సర్‌గా మారిన సంగతి తెలిసిందే. తన 10వ సినిమా కోసం బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకున్న ఆయన ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉండలేక బాక్సింగ్ బ్యాగ్‌పై పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఇది కూడా ట్రైనింగ్‌లో భాగమే అనుకోండి. ‘‘కొన్నిసార్లు నేను బలహీనంగా ఉన్నానని అనిపిస్తుంది, అలాంటప్పుడు బ్యాగ్‌పై పిడిగుద్దులు కురిపిస్తా’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో పేర్కొన్న వరుణ్ తేజ్.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వరుణ్ బాగా దిట్టంగా, అసలు సిసలు బాక్సర్‌లా కనిపిస్తున్నారు. వెనుక కోచ్ వేసే విజిల్‌కు అనుగుణంగా ఆయన బ్యాగ్‌పై పంచ్‌లు విసురుతున్నారు. Also Read: కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసమే వరుణ్ ఇలా కష్టపడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 30న సినిమాను విడుద‌ల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కానీ, ఈ లాక్‌డౌన్ వల్ల పనులన్నీ ఆగిపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. Also Read: కాగా, ‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్ సినిమా తరవాత వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న సినిమా కావడంతో ఈ బాక్సింగ్ డ్రామా అంచనాలు పెరిగాయి. దీనికి తోడు వరుణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించడం, బాక్సర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మరో యంగ్ హీరో నీవన్ చంద్ర ఈ సినిమాలో మరో బాక్సర్‌గా కనిపించబోతున్నారు. ఆయనది నెగిటివ్ రోల్. అలాగే, కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yS779g
v

No comments:

Post a Comment