Saturday, 2 May 2020

మెగా అభిమానులకు పండగ లాంటి వార్త.. చిరంజీవితో సల్మాన్ ఖాన్!

నేటితరం ప్రేక్షకలోకం మల్టీస్టారర్ సినిమాల పట్ల మహా ఆసక్తి చూపుతోంది. ఒకేతెరపై ఇద్దరు స్టార్ హీరోలను చూసేందుకు బాగా ఇష్టపడుతున్నారు ఆడియన్స్. దీంతో ఈ ఆసక్తిని క్యాచ్ చేసుకుంటూ ఇద్దరు స్టార్స్‌తో సినిమాలు చేసేలా ఆలోచనలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అదికూడా వేరు వేరు భాషల స్టార్స్ అయితే సినిమా రేంజ్ మరోలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి- బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మలయాళీ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్, పృథ్వీరాజ్ హీరోలుగా రూపొందిన లూసిఫర్ మూవీ మలయాళీ భాషలో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుంచాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ రీమేక్ హక్కులను చేజిక్కించుకున్నారు. ఆయన నిర్మాణంలోనే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాస్టార్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. ఒరిజినల్ వర్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించగా ఆయనకు నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ నటించారు. ఈ క్రమంలోనే తెలుగు వర్షన్‌లో చిరంజీవిని హీరోగా పెట్టి పృథ్వీరాజ్ పోషించిన ఆ పాత్ర సల్మాన్ ఖాన్ చేత చేయించాలని చూస్తున్నారట రామ్ చరణ్. నిజానికి చిరంజీవి రీ ఎంట్రీ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయాలని అనుకున్నారట. కానీ అది కుదరకపోవడంతో లూసిఫెర్ తెలుగు రీమేక్ లో సల్మాన్‌ని తీసుకోవాలని చిరంజీవి కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను 'సాహూ' ఫేమ్ సుజీత్‌కి అప్పగించినట్లు క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా భారీ రేంజ్ లో ఉండేలా స్క్రిప్ట్ రూపొందించామని కోరారట చిరంజీవి. దీంతో స్క్రిప్ట్ దశలోనే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ మూవీలో భాగం కానున్నాడని తెలుస్తుండటం మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో!. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VYS5XO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...