Friday, 8 May 2020

చిన్నతనంలోనే స్టార్ట్ చేశా.. ప్రతీఒక్కరూ అలా ట్రీట్ చేయడం బాధనిపించేది: హన్సిక

ఒకానొక సమయంలో అందచందాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది హాట్ బ్యూటీ . మెరిసే మేలిమి ఛాయతో కెమెరా కూడా కళ్ళు తిప్పలేనంత మాయ చేస్తూ కుర్రాకారును హుషారెత్తించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె పలు తెలుగు, తమిళ, హిందీ బాషా చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ కొట్టేసింది. అగ్ర హీరోలతో రొమాన్స్ చేస్తూ దాదాపు 50 సినిమాలు పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ తన కెరీర్ సంగతులను పంచుకుంది. ఏమీ తెలియని వయస్సులోనే నటించడం మొదలుపెట్టానని, షూటింగ్‌ చేస్తుండగా దొరికిన గ్యాప్‌ లోనే చదువుకుంటూ ఉండేదాన్నని చెప్పింది హన్సిక. ఆటపాట అన్నీ యూనిట్‌ సభ్యులతోనే అని, షూటింగ్‌‌లో పాల్గొంటూనే అందరితో సరదాగా ఉంటూ ఎంజాయ్‌ చేసేదాన్నని చెప్పుకొచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నపుడు అందరూ బాగా ముద్దు చేసేవారని, అలా తన చిన్నతనాన్ని కోల్పోయానన్న ఆలోచన ఇంతవరకూ రాలేదని తెలిపింది హన్సిక. కాకపోతే స్కూల్‌‌లో మాత్రం అందరూ తననొక సెలబ్రిటీగా ట్రీట్‌ చేయడమే కొద్దిగా బాధగా అనిపించేదని ఆమె తెలిపింది. టీచర్లు కూడా అలాగే చూస్తుండటం చాలా మొహమాటంగా అనిపించేదని చెప్పింది. ఇకపోతే తన రెమ్మ్యూనరేషన్ తాలూకు విషయాలు ఎప్పుడూ పట్టించుకోలేదని, ఇప్పటికీ పట్టించుకోనని చెప్పుకొచ్చింది. డబ్బు వ్యవహారాలన్నీ తన తల్లే చుకుంటుందని, అసలు రెమ్మ్యూనరేషన్ ఎంత అనేది కూడా తాను తెలుసుకోనని చెప్పింది హన్సిక. తనకు కార్లు డ్రైవ్‌ చేయడమంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. Also Read: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'దేశముదురు' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. తొలి సినిమాతో అందరినీ అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత ''మస్కా, బిల్లా, కందిరీగ, దేనికైనా రెడీ'' సినిమాలతో ఆకట్టుకుంది. ఇటీవలే వచ్చిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇక తమిళ సినిమాల్లో అయితే తనదైన ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ.. తమిళ తంబీల మనసు దోచుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3biS8lH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...