Saturday, 9 May 2020

మోడలింగ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా.. లైంగిక వేధింపులపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినీ పరిశ్రమలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. అవకాశాల పేరిట వల వేస్తూ లైంగిక వాంఛ తీర్చాలని దర్శక నిర్మాతలు ఫోర్స్ చేశారని చాలామంది హీరోయిన్స్ బాహాటంగా ఒప్పుకున్నారు. 'మీటు, కాస్టింగ్ కౌచ్' లాంటి ఉద్యమాలు తెరపైకి వచ్చాక ఎందరో నటీమణులు నోరు విప్పారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే మీడియాతో మాట్లాడిన చిత్రాంగ‌దా సింగ్.. బాలీవుడ్‌ చిత్రసీమలోని చాలా విషయాలపై స్పందించింది. మహిళలను లైంగిక వాంఛ తీర్చమంటూ వెంటపడే వ్యక్తులు ప్రతిచోటా ఉంటారని ఆమె పేర్కొంది. తాను మోడలింగ్‌లో ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే వరకు ప్రతిచోటా అలాంటి వారిని చూశానని చెప్పింది. కాస్టింగ్ కౌచ్ అనే ఒకేఒక్క కారణంతో ప‌లు సంద‌ర్భాల్లో తాను మంచి మంచి ప్రాజెక్టులను కూడా కోల్పోవాల్సి వచ్చిందని చిత్రాంగ‌దా సింగ్ చెప్పుకొచ్చింది. అంతేకాదు అన్ని కార్పొరేట్ పరిషమాల్లో మహిళలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది చిత్రాంగ‌దా. కాకపోతే ఈ ప్రపంచం ఎలా వెళుతున్న‌ప్ప‌టికీ, ఎంపిక అనేది మ‌న‌ మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుందని ఆమె చెప్పింది. మ‌నం ఎలా ఉండాలనుకుంటే అలాంటి దారిలోనే వెళ్లాలని తెలిపింది. తన విషయానికొస్తే మాత్రం సంతోషం క‌లిగించే మార్గాన్నే ఎన్నుకున్నాను తప్ప ఎవ్వరికీ లొంగలేదని చెప్పింది. Also Read: లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆమె ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించిందట. ఎక్కువగా యోగా, వ్యాయామం చేస్తూ రోజంతా వర్కవుట్స్ చేస్తున్నానని చిత్రాంగ‌దా సింగ్ తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cjnrOQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...