Monday, 11 May 2020

అమ్మతో స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?

ఎంతటివారికైనా అమ్మే ప్రథమ గురువు. అమ్మే దైవం. మనం ఎంత ఎత్తు ఎదిగినా మనల్ని పెంచి పోషించిన అమ్మను మరువకూడదు. అందుకే, అమ్మ గొప్పతనాన్ని, ఆమె త్యాగాన్ని ఒకసారి గుర్తుచేసుకొని కీర్తించడానికి ఏటా మే నెలలోని రెండో ఆదివారం మదర్స్ డేను నిర్వహించుకుంటున్నాం. ఆదివారం (మే 10న) మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన చాలా మంది హీరోహీరోయిన్లు తమ తల్లులకు మదర్స్ డే విషెస్ చెప్పారు. అమ్మతో తమకు ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. అయితే, కొంత మంది నటీనటులు తమ లైఫ్‌లో అమ్మతో గడిపిన మధుర క్షణాలను షేర్ చేసుకున్నారు. కాగా, ‘మహానటి’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన మలయాళ కుట్టి తన తల్లి మేనకా సురేష్‌తో చిన్నప్పుడు తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన తల్లికి మదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలో కీర్తి సురేష్ చాలా క్యూట్‌గా ఉన్నారు. ఈ ఫొటో ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే, కీర్తి సురేష్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలను ఎక్కువగా చేస్తున్నారు. ‘మహానటి’ లాంటి నేషనల్ అవార్డ్ సినిమా తరవాత ఆమె ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంపిక చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తోన్న చిత్రం చివరి దశకు చేరుకుంది. నరేంద్ర నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. Also Read: దీనితో పాటు నరేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ మరో సినిమా చేస్తున్నారు. దీనికి ‘గుడ్‌లక్ సఖీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే, నితిన్ ‘రంగ్ దే’లో కూడా కీర్తి నటిస్తున్నారని అంటున్నారు. వీటితో పాటు తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నారు కీర్తి. మొత్తం వరుస ప్రాజెక్టులతో కీర్తి సురేష్ బాగా బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WPkyyA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...