కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానాన్నే మార్చేసింది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండానికి ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. తమ ఫ్యామిలీలతో సమయాన్ని గడుపుతున్నారు. టాలీవుడ్ హీరోలదీ ఇదే పరిస్థితి. షూటింగ్‌లన్నీ ఆగిపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు వారంతా. సాధారణ ప్రజల మాదిరిగానే వారు కూడా చిన్న చిన్న సరదాలు వదులుకోవాల్సి వస్తోంది. సాధారణంగా హీరోల పుట్టినరోజులు వస్తే అభిమానులకు పండగే. హీరోలు కూడా అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటారు. కానీ, ఈ కరోనా కష్టకాలం అలా కుదరడం లేదు. అందుకే, అభిమానుల శ్రేయస్సు కోసం పుట్టినరోజు వేడుకులకు దూరంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. తాజాగా, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా తన అభిమానులకు పిలుపునిచ్చారు. మే 15న రామ్ తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఆ రోజు ఆయన 32వ ఏట అడుగుపెడతారు. అయితే, తన పుట్టినరోజు వేడుకలను జరపవద్దని ఆయన అభిమానులకు సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటనను విడుదల చేశారు. Also Read: ‘‘నా ప్రియమైన అభిమానులకి, మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టినరోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో, అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరు నా సంతోషం... నా ఎనర్జీ... నా ప్రాణం... అంతకు మించి నా బాధ్యత! ప్రస్తుత విపత్కర పరిస్థితుల రీత్యా ఈసారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం! ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే... నాకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించే, మీ #రాపో’’ తన ప్రకటనలో రామ్ పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WHQaWM
v
No comments:
Post a Comment