Saturday, 23 May 2020

వరుణ్ తేజ్ పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్.. మెగా ప్రిన్స్ ఫన్నీ రియాక్షన్

కొణిదెల వారసుడు, మెగా ప్రిన్స్ ప్రయత్నాలు మొదలెడతామని స్వయంగా అతని తండ్రి నాగబాబు ప్రకటించడంతో ఈ ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తన పిల్లల వివాహాల గురించి మాట్లాడిన నాగబాబు.. ముందుగా నిహారిక పెళ్లి చేసి, ఆ వెంటనే వరుణ్ తేజ్ మ్యారేజ్ కూడా చేసేస్తామని ప్రకటించారు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో మెగా ఇంట పెళ్లిబాజాల వార్త తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో తాజాగా మెగా మేనల్లుడు, హీరో .. వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ''ఏంటి? బావా.. నీకు పెళ్ళంట'' అంటూ మేనమామ నాగబాబు యూ ట్యూబ్ ఇంటర్వ్యూ తాలూకు ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ పెట్టారు సాయి తేజ్. ఈ ట్వీట్ చూసిన సంగీత దర్శకుడు తమన్.. 'నిజమా' అంటూ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ను అదే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో వెంటనే ఈ ఇద్దరి ట్వీట్స్‌పై వరుణ్ రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు. Also Read: దానికి చాలా టైమ్ ఉందిలే గానీ.. మన రానా దగ్గుబాటి, నితిన్ మాత్రం మీతోనే ఉంటాం అంటూనే సింపుల్‌గా సింగిల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారని పేర్కొన్నారు వరుణ్ తేజ్. ఈ ట్వీట్స్ చూసిన మెగా అభిమానులు తెగ మురిసిపోతూ లైకులు, రీ ట్వీట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XqcULh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...