Thursday, 28 May 2020

పూజా.. సమంతకు సారీ చెప్పు: ఆడేసుకుంటున్న ఫ్యాన్స్

సమంత ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. తమ సత్తా ఏంటో పూజా హెగ్డేకు చూపిస్తున్నారు. సమంతకు పూజా హెగ్డే క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా ఒక ట్రెండ్‌కు తెరలేపారు. దీనికి కారణం పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సమంతపై చేసిన కామెంట్. ‘సమంత అందంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఇది చూసిన సమంత అభిమానులు ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో ఏకేయడం మొదలుపెట్టారు. #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌తో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇండియాలో టాప్ ట్విట్టర్ ట్రెండ్. అయితే, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని నిన్న అర్ధరాత్రి దాటిన తరవాత పూజా హెగ్డే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌ అయ్యింది. నేను నా టీమ్‌కు సమాచారం ఇచ్చాను. నా డిజిటల్ టీమ్ దీనిపై పనిచేస్తోంది. దయచేసిన ఎలాంటి ఇన్విటేషన్లను యాక్సెప్ట్ చేయకండి. వ్యక్తి గత సమాచారం కూడా షేర్ చేసుకోకండి’’ అని ట్వీట్‌లో పూజా పేర్కొన్నారు. ఆ తరవాత ఒక గంటలకు పూజా మరో ట్వీట్ చేశారు. ‘‘నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ భద్రత కోసం గంటపాటు చాలా కష్టపడ్డాం. ఇలాంటి సమయంలో తక్షణమే సహాయాన్ని అందించిన నా టెక్నికల్ టీమ్‌కి కృతజ్ఞతలు. మొత్తానికి మళ్లీ నా ఇన్‌స్టాగ్రామ్ నా చేతుల్లోకి వచ్చింది. గడిచిన గంట సమయంలో నా అకౌంట్ నుంచి ఏమైనా పోస్ట్‌లు వచ్చి ఉంటే వాటన్నింటినీ తీసేశాను’’ అని పూజా తన రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ట్వీట్లలో అసలు సమంత గురించి ప్రస్తావించకపోవడం అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. సమంత, పూజా హెగ్డే అందాలను కొలతేసి మరీ ఆడుకుంటున్నారు. సమంత చేసిన సినిమాలను, పూజా హెగ్డే చేసిన సినిమాలను కంపేర్ చేస్తున్నారు. సమంత విజయాలతో పోలిస్తే నీ సినిమాలు ఎక్కడుంటాయని పూజాను ప్రశ్నిస్తున్నారు. సమంత తెలుగు, తమిళ అభిమానులు కలిసి ట్విట్టర్‌లో అరాచకం సృష్టిస్తున్నారు. అయితే, మధ్యలో కొంత మంది పూజా హెగ్డే ఫ్యాన్స్ కూడా దూరుతున్నారు. దీనిలో పూజా తప్పేమీ లేదని, ఆమె క్షమాపణ చెప్పదని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి పూజా హెగ్డే ఇన్‌స్టా పోస్ట్ పెద్ద యుద్ధానికే తెరలేపింది. ఇదిలా ఉంటే, తాజాగా సమంత విక్టరీ సింబల్ చూపిస్తూ దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. ఇది ఫ్యాన్స్‌ని కూల్ చేయడానికి చేసిన ట్వీట్‌లా అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2M7Od0Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...