Saturday, 9 May 2020

సినీ ఇండస్ట్రీలో వారసత్వంపై మహేష్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. బ్యాక్‌గ్రౌండ్ లేదంటే!!

చిత్రసీమలో నేపోటిజం (బంధు ప్రీతి) ఎక్కువగా ఉంటుందని, స్టార్ హీరోహీరోయిన్స్ వారసులకే సినిమా అవకాశాలు ఇస్తారని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ఎవ్వరూ పట్టించుకోరనే ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోని చిత్ర సీమల్లో ఇదే పరిస్థి ఉందని కామెంట్స్ చేస్తున్నారు కొందరు సినీ తారలు. టాలెంట్‌తో సంబంధం లేకుండా కేవలం స్టార్ కిడ్స్ అనే ఓకే ఒక ఆధారంతో సినిమా అవకాశాలు ఇస్తున్నారని పేర్కొంటూ గతంలో కంగనా రనౌత్, తాప్సీ సైతం విమర్శలు చేశారు. తాజాగా ఈ లిస్టులో మహేష్ హీరోయిన్ చేరింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతి సనన్.. సినీ రంగంలో ఉన్న వారసులపై కామెంట్ చేస్తూ, టాలెంట్ ఉన్నా లేకపోయినా సినీ వారసులకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో సినీ ప్రముఖుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. వాళ్లకు ఓ సినిమా ఫ్లాప్ అయితే మరో అవకాశం దక్కుతోంది కానీ.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లకు మాత్రం ఒక్క ఫ్లాప్ వస్తే మరో అవకాశం రావడం లేదని చెబుతూ ఇండస్ట్రీలో నేపోటిజం ఉండటం తప్పని పేర్కొంది. Also Read: వారసత్వం ఉన్నా కూడా కొందరు సొంతంగా తమ కాళ్లపై నిలబడ్డారు. కానీ కొందరు మాత్రం బ్యాగ్రౌండ్ ఉన్నా ఫెయిల్ అయ్యారని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. వారసత్వం అనేది ఎంట్రీ వరకు ఉంటే ఫర్వాలేదు గానీ, వాళ్ళకే అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేయడం సరికాదని కృతి సనన్ అభిప్రాయపడింది. గతంలో కూడా చాలామంది సినీ వారసులపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35IeI6a
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...