Tuesday, 26 May 2020

ఎన్టీఆర్ మూవీలో సమంత! నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయ్యే అప్‌డేట్..

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ప్రస్తుతం RRR మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాలో రామ్ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ చేస్తూనే తన తదుపరి సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కమిట్ అయ్యారు ఎన్టీఆర్. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఈ మూవీని సెట్స్ పైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు హీరోయిన్ల వేట ప్రారంభించిన త్రివిక్రమ్.. పూజా హెగ్డే, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, శృతి హాసన్, సమంత‌ల పేర్లు పరిశీలనలో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు మెయిన్ హీరోయిన్‌గా సమంతను ఫైనల్ చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. Also Read: ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలోను, అటు ఎన్టీఆర్ సరసన నటించిన అనుభవం సమంతకి ఉంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ''అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ.. ఆ'' సినిమాలు చేసి భారీ విజయాలు అందుకుంది సమంత. అలాగే ఎన్టీఆర్ సరసన ''బృందావనం, రామయ్యా వస్తావయ్యా, జనతా గ్యారేజ్, రభస'' సినిమాల్లో ఆడిపాడి నందమూరి అభిమానులను అలరించింది. అందుకే వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తనదైన స్టైల్‌లో కథ సిద్ధం చేసుకున్న త్రివిక్రమ్ ఈ కథలో నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నారట. ఈ చిత్రానికి '' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zuHR9n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...