Friday, 22 May 2020

ఇలా చేస్తేనే మనల్ని మనం కాపాడుకోగలం.. ఇది తప్పనిసరి అంటున్న మహేష్ బాబు

కరోనా కారణంగా విధించిన ఈ లాక్‌డౌన్ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు సూపర్ స్టార్ . కుటుంబంతో సరదాగా గడుపుతూనే సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. కొడుకు గౌతమ్, కూతురు సితారలతో ఆడుకుంటున్న పిక్స్, వీడియోలు షేర్ చేస్తూనే, మరోవైపు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కరోనా నివారణకై మార్గదర్శకం అవుతోంది. తాను మాస్క్‌తో దిగిన ఫొటో పోస్ట్ చేస్తూ.. అందరూ విధిగా మాస్కులు ధరించాలని కోరారు మహేష్ బాబు. ''సడలింపులతో మెల్లగా లాక్‌డౌన్ నుంచి బయటపడుతున్నాం. క్రమంగా అన్నీ సర్దుకొని మంచి రోజులొస్తాయి. కాకపోతే ఇలాంటి సమయంలో మాస్కులు ధరించడం తప్పనిసరి. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కు ధరించండి. దీనివల్ల మనల్ని మనం రక్షించుకోవడమే గాక, ఇతరులను కూడా రక్షించిన వాళ్లమవుతాం. జీవితం మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్తోంది. నేను మాస్కు ధరించాను.. మరి మీరు?'' అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు మహేష్. ఈ ట్వీట్ చూసిన మహేష్ అభిమాన వర్గం, నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ 'తప్పకుండా సార్' అని సమాధానమిస్తున్నారు. Also Read: ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్నారు. మహేష్- రష్మిక జోడీగా వచ్చిన ఈ మూవీ పలు రికార్డులు తిరగరాసింది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు మహేష్ బాబు. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bUGVrO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...