Monday, 25 May 2020

డబ్బింగ్‌కు ‘నాంది’ పలికిన అల్లరి నరేష్

అల్లరి న‌రేష్‌ హీరోగా వస్తో్న్న చిత్రం ‘నాంది’. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఈ ఇంటెన్స్ ఫిల్మ్ డ‌బ్బింగ్ ప‌నులు రంజాన్ పర్వదినం సంద‌ర్భంగా సోమ‌వారం మొద‌ల‌య్యాయి. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ‘ఎ న్యూ బిగినింగ్’ అనేది ఈ సినిమాకు ఉప‌శీర్షిక‌. సామాజిక అంశాల మేళ‌వింపుతో, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రమిది. అల్లరి న‌రేష్‌ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇది అల్లరి న‌రేష్ న‌టిస్తోన్న 57వ చిత్రం. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగే ఈ భిన్న త‌ర‌హా చిత్రానికి అబ్బూరి ర‌వి, చోటా కె. ప్రసాద్‌, శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌, బ్రహ్మ క‌డ‌లి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు. వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ప్రవీణ్ కీల‌క పాత్రలు పోషించారు. Also Read: కాగా, ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. మధ్యలో లాక్‌డౌన్ కారణంగా ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన ‘నాంది’ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో నరేష్‌ ఒంటి మీద దుస్తులు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZuKjY6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...