Tuesday, 12 May 2020

రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ముహూర్తం ఫిక్స్ చేసిన మహేష్ బాబు!!

ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న తన తదుపరి సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా స్టార్ట్ చేయబోతున్నారు మహేష్. ఇదిలాఉంటే ఇటీవలే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లుగా కీలక ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్టుపై పడింది. ఈ సినిమా ఓ జానర్‌లో ఉంటుంది? బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని, పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వాలనే దిశగా ఆలోచిస్తున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు. తన రెస్పాన్స్ తెలియజేస్తూ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పాలని భావిస్తున్నారట. ఇందుకోసమై తన తండ్రి పుట్టిన రోజైన మే 31వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ అభిమానులను సర్‌ప్రైజ్ చేసేలా ఈ అప్‌డేట్ ఉండనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అటు రాజమౌళి ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Also Read: మరోవైపు రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. యదార్ధ ఘటనలకు కొంత కల్పితాన్ని జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 8న RRR సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే మహేష్ సినిమాను సెట్స్ పైకి తేవాలని చూస్తున్నారట రాజమౌళి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fGhttr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...