అక్కినేని నాగ చైతన్య- జంటగా నటిస్తున్న కొత్త సినిమా ''. ఫీల్ గుడ్ కథలను తనదైన కోణంలో మలిచి యూత్ ఆడియన్స్‌ని ఆకర్షించే శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నేడు (మే 9) సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెబుతూ తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో వర్షంలో తడుస్తూ నాచురల్ లుక్‌లో కనిపించి ఆకర్షిస్తోంది సాయి పల్లవి. ‘లవ్ స్టోరీ’ నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ఆమెకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు నాగ చైతన్య. గతంలో ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తన ఇష్టసఖుడ్ని కాలర్ పట్టుకుని దగ్గరకు లాగుతూ.. కళ్లు మూసుకుని ప్రేమ తన్మయం పొందుతున్న సాయి పల్లవి లుక్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్స్‌ని బట్టి చూస్తే ఈ మూవీలో నాగ చైతన్య- సాయి పల్లవి రొమాంటిక్ డోస్ ప్రేక్షక లోకాన్ని ఫిదా చేస్తుందని స్పష్టమవుతోంది. మొదట ఈ సినిమాను లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు కానీ పలు కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసి విడుదల చేద్దామని అనుకున్న తరుణంలో లాక్‌డౌన్ కారణంగా మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35Qedaj
v
No comments:
Post a Comment