Monday, 4 May 2020

దీపికా పదుకొణె తల్లికాబోతుందా ?

బాలీవుడ్ బ్యూటీ తల్లి కాబోతుందా? ఆమె గర్భవతియా ? ప్రస్తుతం ఈ ప్రశ్నలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి దీపికా పెట్టిన పోస్టే కారణం. దీపికా గత కొన్ని రోజులుగా లాక్ డౌన్‌తో ఇంట్లోనే ఉండటంతో వంటలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. దీంతో తాజాగా మామిడికాయ్ ముక్కల్ని కట్ చేసి వాటిపై ఉప్పు కారం చల్లిన ఫోటోను దీపికా పోస్టు పెట్టింది. దీంతో బాలీవుడ్ భామా చేసిన ఈ పోస్టుకు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. దీపికా తల్లి కాబోతున్నావా ? గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతున్నావు అంటూ ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ రణ్‌వీర్ సింగ్‌, దీపికా పదుకొణే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ 2018 నవంబర్‌లో ఇటలీలోని లేక్ కోమోలో కొంకిణీ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత దంపతులు తమకు దొరికిన హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ, వారి వారి ప్రాజెక్టులని పూర్తి చేస్తూ వచ్చారు. రణ్‌వీర్, దీపిక కలిసి గోలియోం కీ రాస్‌లీలా, రామ్-లీలా, 'ఫైండింగ్ ఫానీ', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్‌' లలో నటించారు.అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇద్దరూ ఇంటికే పరిమితం అయ్యారు. రణ్‌వీర్ ఎక్కువగా నిద్ర పోతుండగా... దీపికా మాత్రం రకరకాల వంటలు చేస్తూ టైమ్ పాస్ చేస్తోంది. నేర్చుకుంటుంది. మరి తాజాగా వచ్చిన ఈ వార్తలపై దీప్ వీర్ జంట ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35xvvc3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...