Saturday, 2 May 2020

షాకింగ్.. పాయల్‌‌కి కరోనా పాజిటివ్! అసలు విషయం చెప్పేసిన అందాల తార

ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది వైరస్. కంటికి కనిపించని ఈ శత్రువు అశేష ప్రజానీకాన్ని వణికిస్తూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే 37 లక్షల మంది కరోనా బారిన పడగా, ఇందులో సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఉన్నారు. ఇక్కడి వరకూ ఓకే కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఎవ్వరికి ఏ చిన్న జ్వరం వచ్చినా అది కరోనానే అనే అపోహ జనాల్లో పెరిగిపోయింది. జ్వరం వస్తే చాలు ఆ వ్యక్తికి కరోనా సోకిందని చెప్పడం మొదలు పెట్టేస్తున్నారు. ఇక సెలబ్రిటీల పరిస్థితి అయితే మరీ దారుణం. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కరోనా అనే రూమర్ స్ప్రెడ్ చేసే సిచుయేషన్ క్రియేట్ అయింది. తాజాగా తెలుగు హీరోయిన్ విషయంలో అదే జరిగింది. ఇటీవల అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లడంతో ఆమెకు కరోనా సోకిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఇలాంటి వార్తలపై స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది సదరు హీరోయిన్. ''నాకు తొలుత తలనొప్పి, ఆపై జ్వరం రావడంతో నా బంధుమిత్రులు ఆందోళనకు గురయ్యారు. నాకు కరోనా సోకిందేమో అని భయపడ్డారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా అది కరోనా కాదని మలేరియా ఫీవర్ అని తేలింది. ప్రస్తుతం మలేరియా నుంచి కోలుకుంటున్నా'' అని చెబుతూ తనకు కరోనా అని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది పాయల్ ఘోష్. ప్రస్తుతం ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారి త్వరలోనే పూర్తి నియంత్రణలోకి వస్తుందని విశ్వసిస్తున్నానని, మళ్ళీ మనమందరం మునపటి సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని బలంగా నమ్ముతున్నానని ఈ సందర్భంగా పాయల్ ఘోష్ పేర్కొంది. పలు బాలీవుడ్ సినిమాలు చేసిన పాయల్.. టాలీవుడ్‌లో ''ప్రయాణం, ఊసరవెల్లి'' సినిమాల్లో నటించింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WieDSs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...