Wednesday, 13 May 2020

మూఢం ఎఫెక్ట్.. రేపే నిఖిల్ పెళ్లి

కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ, కరోనా వైరస్ వచ్చి ఆ కళ్యాణాన్ని కూడా ఆపేసింది. అయితే, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ విషయంలో మాత్రం కళ్యాణం ఆగడంలేదు. అనుకున్న తేదీకే నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. డాక్టర్ పల్లవి వర్మను రేపు సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు పెళ్లి జోలికి వెళ్లనని ఇటీవలే నిఖిల్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే, లాక్‌డౌన్ సమయం ముగిశాక అంటే వచ్చే నెల నుంచి మూఢం వస్తుంది. మంచి రోజులు లేవు. అందుకే, ఇక పెళ్లిని వాయిదా వేసుకోవడం మంచికాదనుకున్నారు నిఖిల్. మార్చిన తేదీ మే 14న నిఖిల్ పెళ్లి జరగుతోంది. Also Read: తాను ప్రేమించిన అమ్మాయి, భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఏప్రిల్ 16వ తేదీని ఖరారు చేశారు. అయితే, పెళ్లి తేదీకి సుమారు నెల రోజుల ముందు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో, రెండు కుటుంబాలు చర్చించుకుని మే 14వ తేదీని ఖరారు చేసుకున్నాయి. అయితే, లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు, తెలంగాణ ప్రభుత్వం మే 29 వరకు పొడిగించడంతో ఇక ఈ పరిస్థితి ముగిసే వరకు పెళ్లిని వాయిదా వేయాలని నిఖిల్ నిర్ణయించుకున్నారు. కానీ, మంచి ముహూర్తాలు దరిదాపుల్లో లేకపోవడంతో రేపు పెళ్లి చేసుకుంటున్నారు. Also Read: ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం తమ కుటుంబాలకు చెందిన కొంత మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారట. హైదరాబాద్ శివారులోని ఒక ఫాం హౌస్‌లో పెళ్లి జరుగుతుందని సమాచారం. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులను చేసే కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్‌లోనే జరుగుతాయట. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారని తెలిసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3byVhhK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...