Tuesday, 26 May 2020

మందు బాబుకు సోనూ సూద్ కౌంటర్.. వింత విన్నపంపై మనోడి రియాక్షన్ చూస్తే!

టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. సోషల్ మీడియా ప్రతిఒక్కరి అరచేతిలో ఆటాడుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, హలో, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మరింత దగ్గరవుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు, సెలబ్రిటీల మధ్య దూరం తగ్గుతూ వస్తోంది. సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి నేరుగా సెలబ్రిటీల వాల్ లోకి దూసుకెళ్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ సినీ నటుడు సోనూ సూద్‌ని వింత కోరిక కోరడంతో దానికి రిప్లైగా ఆయన అదిరిపోయే కౌంటర్ వేశారు. లాక్‌డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో వలస కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సొంత గూటికి చేరేందుకు వందల మైళ్ళు నడిచి వెళ్తున్నారు. అయితే వాళ్ళ కష్టాలు చూసి చలించిపోయిన బాలీవుడ్‌ నటుడు ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలకు పది బస్సులు అరేంజ్ చేసి వారి వారి ఇళ్లకు చేర్చారు. దీంతో ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. Also Read: ఈ పరిస్థితుల్లో ఓ నెటిజన్ సోను సూద్ నుంచి వింత సహాయం కోరాడు. ''సోనూ భాయ్.. నేను మా ఇంట్లో ఇరుక్కుపోయాను. లిక్కర్ షాప్‌ వరకు వెళ్లేందుకు నాకు సాయం చేయండి'' అని కొంటె ట్వీట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్‌పై స్పందించిన సోను సూద్ ఆ మందుబాబుకు షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు. ''మద్యం షాపు నుంచి ఇంటికి వెళ్లడానికైతే సాయం చేస్తాను. అది నీకు అవసరమైతే చెప్పు'' అంటూ రియాక్ట్ అయ్యాడు సోను సూద్. ఆయనిచ్చిన ఈ సమాధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఈ ట్వీట్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూ సూద్ సమయస్ఫూర్తి, రెస్పాన్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LZGm5D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...