మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ చుట్టే తిరుగుతూ మెగా కాంపౌండ్ అభిమానులనే టార్గెట్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఈ క్రమంలోనే ఇటు అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' మూవీ రూపొందిస్తూనే అటు రామ్ చరణ్ నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం' రూపంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆయన.. ఇప్పుడు అదే రామ్ చరణ్ సహకారంతో ఆన్‌లైన్ వేదికలను హోరెత్తించే ప్లాన్ రెడీ చేశారట. ఈ మేరకు రామ్ చరణ్- కాంబోలో వెబ్ సిరీస్ మంతనాలు సీరియస్‌గా జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్. డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలకు డిమాండ్ పెరుగుతుండటం గమనించిన సుకుమార్.. భారీ రేంజ్ వెబ్ సిరీస్ రూపొందించాలని చూస్తున్నారట. అయితే ఈ వెబ్ సిరీస్‌కి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం పుష్ప సినిమా కోసం రాసుకున్న కథ ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ రూపొందించనున్నారని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా కోసం సుకుమార్ అండ్ టీమ్ సేకరించిన విషయాల్లో కొంత భాగాన్ని మాత్రమే ‘పుష్ప’ సినిమాలో ఉపయోగించి.. మిగిలిన భాగాన్ని ఉప కథలుగా మలిచి వెబ్ సిరీస్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు టాక్. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇందుకోసం రామ్ చరణ్ కూడా ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఇన్‌సైడ్ టాక్. ఇది గనక సక్సెస్ కావాలే గానీ మరోసారి సుక్కు- రామ్ చరణ్ మ్యాజిక్ రిపీట్ అయినట్లే మరి. ఏదేమైనా మెగా కాంపౌండ్ అభిమానులపైనే సుకుమార్ దృష్టి పెడుతుండటం గమనార్హం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2z4hne8
v
No comments:
Post a Comment