Wednesday, 20 May 2020

ఇది షాకింగే.. సన్నీలియోన్ ‘డియో డియో డిసక డిసక’లు ఇక ఉండవా?

సన్నీ లియోన్.. ఆ పేరు వింటేనే చాలా మందిలో వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతుంటాయి. పోర్న్ స్టార్‌గా కోట్లాది మందికి ఆరాధ్య దేవతలా మారిన .. ప్రస్తుతం బాలీవుడ్‌, ఇతర భాషల్లో రొమాంటిక్ పాత్రలు, గ్లామర్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ దక్కించుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా డియో డియో డిసక డిసక అంటూ చేరువయ్యింది సన్నీ లియోన్. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’లో రొమాంటిక్ పాత్రలో మెరిసన సన్నీ లియోన్ .. రాజ శేఖర్ హీరోగా నటించిన ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. డియో డియో అంటూ కుర్రకారుని కైపెక్కించింది సన్నీ లియోన్. ఈ చిత్రంలోని ఈ పాట 100 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిందంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సన్నీ లియోన్ అమెరికాకు పయనమయ్యారు. కరోనా నేపథ్యంలో అక్కడైతేనే సేఫ్ అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లినట్టు చెప్పిన సన్నీ.. ఇప్పట్లో ఇండియాకు వచ్చే పరిస్థితి అయితే లేదు. అమెరికా పౌరసత్వం ఉన్న సన్నీ స్పెషల్ పర్మిషన్స్‌తో అమెరికాకు వెళ్లినా అక్కడ కూడా కరోనా తీవ్రత గట్టిగానే ఉంది. మరి ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది పక్కనపెడితే.. ప్రస్తుతం ఆమె అమెరికాలో క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఇప్పట్లో ఇండియాకి వచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో ఆమె తిరిగి తెలుగు, ఇతర భాషల్లో కనిపించడం కష్టంగా మారింది. ‘కరెంట్ తీగ’గా మెరవాలన్నా.. ‘డియో డియో డిసక డిసక’ అని మైమరపించాలన్నా అది ఇప్పట్లో అయ్యే పని కాదని చెప్పకనే చెబుతోంది సన్నీ. కాని ప్రస్తుతం సన్నీ లియోన్ చేతిలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉంది. అదే 'వీరమ దేవి'. ఈ సినిమా కొన్ని నెలల క్రితమే లాంచ్ అయినప్పటికీ ప్రాజెక్ట్ పనులు కదలడం లేదు. వీసీ వడివుడైయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సన్నీలియోన్ వీరనారిగా కనిపిస్తుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gj0Ioy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...