టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరికిషన్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయస్సు 57 ఏళ్లు కాగా.. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిందిత వ్యాధితో బాధపడుతున్నారు. సికింద్రాబాద్‌లోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆయన చనిపోయినట్టు ఆయన సన్నిహితులు తెలియజేశారు. ఆయన పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండటంతో వాళ్లు వచ్చేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో బాడీని మార్చురీకి తరలించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gan0sx
v
No comments:
Post a Comment