Monday, 18 May 2020

నాక్కొంచెం మెంటల్ అంటూ పిచ్చెక్కించిన పూరి తనయుడు.. వీడియోతో సెన్సేషన్

పూరి జగన్నాథ్ తనయుడు ఓ డబ్ స్మాష్ వీడియో చేసి పిచ్చెక్కించాడు. మరో యువ నటుడు రాహుల్ విజయ్‌తో కలిసి ఈ వీడియో రూపొందించిన ఆకాష్.. తన తండ్రి పూరి జగన్నాథ్ రూపొందించిన అన్ని సినిమాల్లోని ఫేమస్ డైలాగులతో ఆకర్షించాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఆయన 'మాకు సినిమాలంటే ఎంతో ఇష్టం.. పూరి జగన్నాథ్ అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం' అని పేర్కొన్నాడు. తండ్రి పూరి జగన్నాథ్ సినిమాల్లోని డైలాగులకు తనదైన స్టైల్ జోడించి ఆకర్షించాడు ఆకాష్. ఆకాష్‌కి కాల్ చేయడంతో ప్రారంభమైన ఈ వీడియో.. మెల్లగా పుంజుకొని పీక్స్ లోకి వెళ్ళిపోయింది. 'నువ్ నంద అయితే నేను బద్రి బద్రినాథ్' అనే ఫేమస్ డైలాగ్ చెప్పిన రాహుల్ విజయ్‌కి కౌంటర్‌గా 'నాక్కొంచెం మెంటల్' అంటూ పిచ్చెక్కించేశాడు ఆకాష్ పూరి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో పూరి చెప్పించిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఏవీ వదలకుండా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ పరేషాన్ చేసేశారు రాహుల్ విజయ్, ఆకాష్ పూరి. చివరగా ''ఒక్క ఛాన్స్'' అంటూ వీడియో ముగించారు. దీంతో ఈ వీడియో నెట్టింట సెన్సేషన్ అవుతూ వైరల్ అయింది. తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'మెహబూబా' సినిమాతో హీరోగా పరిచయమైన ఆకాష్ పూరి.. ప్రస్తుతం 'రొమాంటిక్' సినిమా చేస్తున్నాడు. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన హాట్ బ్యూటీ కేతికశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. డోస్ మరింత పెంచి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు పూరి జగన్నాథ్. మరోవైపు 'సూర్యకాంతం, కాలేజ్ కుమార్' సినిమాలతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాడు రాహుల్ విజయ్. సో.. ఈ అప్‌కమింగ్ హీరోలిద్దరూ తమలో టాలెంట్ చాలానే ఉందని, ఒక్క మంచి ఛాన్స్ దొరికితే మరోలా ఉంటుందని ఈ వీడియోతో చెప్పకనే చెప్పేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e1RbQR
v

No comments:

Post a Comment