Friday, 1 May 2020

మెగా అభిమానులకు షాక్.. చిరంజీవితో కుదరదంటున్న కాజల్! కారణం ఇదే..

మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న '' సినిమాను హీరోయిన్ కష్టాలు వెంటాడుతున్నాయి. మొదట ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిషను సెలెక్ట్ చేయగా ఆమె అనూహ్యంగా తప్పుకొని షాకిచ్చింది. ఈ క్రమంలో మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతూ ఆ స్థానాన్ని అగర్వాల్‌తో భర్తీ చేసేందుకు ప్లాన్ చేశారు కొరటాల. ఈ మేరకు భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసి కాజల్‌ని తీసుకున్నారు. కానీ తీరా సెట్స్ మీదకొచ్చే సమయానికి త్రిష లాగే కాజల్ కూడా హాండిచ్చిందని తెలుస్తోంది. ఆచార్యలో నటించడం కుదరదని తెగేసి చెప్పిందట కాజల్. అయితే ఇలా ఉన్నట్టుండి కాజల్ తప్పుకోవడానికి బలమైన కారణముందని తెలిసింది. చిరంజీవి 'ఆచార్య'తో పాటు ఓ తమిళ సినిమా చేసేందుకు కూడా కమిటైన కాజల్.. ఆ సినిమా నిర్మాతల నుంచి ఆడ్వాన్స్ కూడా తీసుకుందట. జులై నుంచి డేట్స్ ఇస్తానని మాటిచ్చిందట. వచ్చే నెలతో లాక్‌డౌన్ ఫినిష్ అయ్యే అవకాశాలుండటంతో షెడ్యూల్ ప్రకారం ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లాలని కాజల్ డిసైడ్ అయిందట. నిజానికి అప్పటికల్లా 'ఆచార్య'లో కాజల్ పార్ట్ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ అడ్డురావడంతో అది వాయిదా పడి సరిగ్గా జూలైలోనే సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఒకేసారి ఈ రెండు సినిమాలను డేట్స్ కేటాయిస్తూ హ్యాండిల్ చేయడం కష్టమని భావించిన కాజల్.. డ్వాన్స్ తీసుకున్నా కాబట్టి తమిళ సినిమాకే డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యిందట. ఆ రకంగా ఆచార్య నుంచి తప్పుకోవడం తప్ప, ఆమె వద్ద వేరే మార్గం లేకపోవడంతో నిర్మొహమాటంగా చిరంజీవితో కుదరదని చెప్పేసిందట కాజల్. సో.. చూడాలి మరి చిరంజీవి 152 మూవీ కోసం కొరటాల మళ్ళీ ఎవరిని లైన్ లోకి తీసుకొస్తారో!. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SulTJT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...