Friday, 8 May 2020

నందమూరి అభిమాలకు గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ 31 ఫిక్స్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌!!

నందమూరి అభిమానులకు మరింత హుషారెత్తించేలా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తన 29వ సినిమాగా RRR చేస్తున్న ఆయన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా మూవీ కూడా కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కోసం భారీ కథను సిద్ధం చేశారని ఇన్‌సైడ్ టాక్. ఈ కథను ఎన్టీఆర్‌కి కూడా నేరేట్ చేయడం జరిగిందని, కథ విన్న వెంటనే ఆయన ఓకే చేశారని సమాచారం. కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం రోమాలు నిక్కబొడిచే సీన్స్ రాసుకున్నారని అంటున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా, ఎన్టీఆర్‌ని డిఫరెంట్ మేకోవర్‌తో చూపేలా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. 2021 చివరి నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అంతేకాదు ఈ మూవీ కోసం ఎన్టీఆర్ రెండేళ్ల పాటు డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో గత రికార్డులు తిరగరాసేలా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా రూపొందించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ తాజా సినిమా RRR చిత్రీకరణ పరంగా చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తికాగానే త్రివిక్రమ్ మూవీ, ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాతో నందమూరి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా రెడీ అవుతున్నారట ఎన్టీఆర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LagzaH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...