Thursday, 21 May 2020

నటి తండ్రిపై రేప్ కేసు... 20 ఏళ్ల యువతిని బెదిరించి

బాలీవుడ్ నటి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అతడు... ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తతోంది. బాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 13 కంటెస్టెంట్, మోడల్ తండ్రి సంతోఖ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతిని రేప్ చేసారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్ల అమ్మాయిని తుపాకీతో బెదిరించి సంతోఖ్ సింగ్ అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులకు అందిన సమాచారం మేరకు స్నేహితురాలితో కలసి మరో స్నేహితుడిని కలవడానికి బాధితురాలు బియాస్ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం 5.30 గంటలకు వారు బియాస్ కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంతోఖ్ సింగ్ యువతిని బెదిరించాడు. అమ్మాయిపై తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించాడు. ఆ తర్వాత కారులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.. మే 14వ తేదీన ఈ దారుణం జరిగినప్పటికీ... ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబం భయపడింది. ఓ వ్యక్తి చొరవతో బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇవన్నీ అవాస్తవ ఆరోపణలు అని కొట్టి పారేస్తున్నాడు షెహనాజ్ గిల్ బ్రదర్ షెహబాజ్. తన తండ్రి పరువు తీయడానికి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని చెబుతున్నాడు. బిగ్ బాస్ 13 సీజన్‌లో షెహనాజ్ గిల్ పాల్గొంది. తన దైన శైలీలో షోలో కనిపిస్తూ అనేక మంది అభిమానుల్ని సంపాదించుకుంది. షెహనాజ్ పంజాబి సినిమాల్లో కూడా నటించింది. ఆమె సింగర్ కూడా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TtRzQ0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...