Wednesday, 1 April 2020

RGV (రోజూ గిల్లే వాడు) వచ్చాడు.. అన్నంతపని చేసిన గేయ రచయిత

‘‘గిల్లడం ఒక భోగం.. గిల్లించుకోవడం ఒక యోగం.. గిల్లలేక పోవడం ఒక రోగం’’ ఇదే వివాదాల దర్శకుడు వర్మ సూత్రం. అందుకే ఎప్పుడూ ఎవర్నొకర్ని ట్వీట్లు, కామెంట్‌ల రూపంలో గిల్లడం.. ఆ తరువాత ఫ్యాన్స్‌తో గిల్లించుకోవడం వర్మ సార్‌కి అలవాటు.. అయితే ఎప్పుడూ ఎదుటి వారిని గిల్లడమే.. ఈసారి వర్మనే నేను గిల్లుతా అంటూ వచ్చారు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల. వర్మ-జొన్నవిత్తుల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో అందర్నీ గిల్లే వర్మపై సినిమా తీస్తా అంటూ సవాల్ చేశారు జొన్నవిత్తుల అన్నట్టుగానే.. ఈ సినిమాకు ‘’ (అందర్నీ గిల్లే వర్మ) అని నామకరణం చేసి షూటింగ్ పట్టాలెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ట్యాగ్‌లైన్ విడుదల చేశారు జొన్న విత్తుల. ఈ చిత్రంలో సురేష్, శ్రద్ధాదాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాల కుటుంబరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందరి బయోపిక్‌లు తనకు నచ్చినట్టుగా తీసి వివాదాలు రాజేసే వర్మ జీవిత చరిత్రపైనే సినిమా తీసి వర్మతో ఢీ కొడుతున్నారు జొన్నవిత్తుల. ఈ సందర్భంగా టైటిల్‌లోగోను విడుదల చేస్తూ.. ‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన ఈ రామబాణమే ఈ సినిమా’ అంటూ వర్మను పేరు ప్రస్తావించకపోయినప్పటికీ తన బాణం వర్మ మీదే అని ‘RGV’ (అందర్నీ గిల్లే వర్మ) అని చెప్పకనే చెబుతున్నారు జొన్నవిత్తుల. మరి చూడాలి ఈ జొన్నవిత్తుల ‘RGV’పై అసలు ‘RGV’ స్పందన ఎలా ఉంటుందో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bLjguz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...