Monday, 27 April 2020

హాట్ యాంకర్‌తో సుడిగాలి సుధీర్ రొమాన్స్‌కి బ్రేక్! అసలు కారణం ఇదేనా..?

ఈ రోజుల్లో వెండితెరపై హీరోయిన్లు పండించే రొమాన్స్ కంటే బుల్లితెర యాంకర్స్ ఇచ్చే రొమాంటిక్ కిక్కే ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇంట్లోనే కూర్చొని హాట్ యాంకర్ల కెమిస్ట్రీ చూస్తూ ఫిదా అవుతోంది నేటి యువత. ఈ క్రమంలోనే లేడీ యాంకర్లతో జబర్దస్త్ కమెడియన్ పండించే రొమాన్స్ పీక్స్ లోకి వెళ్లి అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రష్మీ- సుధీర్ జోడీ కనిపిస్తే చాలు బుల్లితెర షేక్ అవ్వాల్సిందే. అదొక్కటే కాదు.. పోవే పోరా ప్రోగ్రాంలోనూ యంగ్ యాంకర్ విష్ణు ప్రియతో అంతే ఘాటు రొమాన్స్ చేస్తున్నాడు సుడిగాడు. అయితే ఇప్పుడు ఈ హాట్ జోడీ రొమాన్స్‌కి బ్రేక్ పడిందని తెలుస్తోంది. సుధీర్- విష్ణుప్రియ జోడీ ఇకపై పోవే పోరా ప్రోగ్రాంలో అల్లరి చేస్తూ రొమాన్స్ పండించరనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ లాక్ డౌన్ ఫినిష్ కాగానే సుడిగాలి సుధీర్ తన ఫోకస్ అంతా సినిమాలపై పెట్టాలని చూస్తున్నాడని, మరోవైపు సుధీర్- విష్ణుప్రియ జోడీకి అనుకున్న రేంజ్‌లో డిమాండ్ లేకపోవడంతో సుధీర్ స్థానంలో మరో యాంకర్‌ని తీసుకోవాలని ఆ ప్రోగ్రాం నిర్మాతలు భావిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. రొటీన్‌కి భిన్నంగా బుల్లితెర లోకానికి కొత్తదనం చూపించాలనే ఉద్దేశ్యంతో సుధీర్ బదులుగా మాస్ అవినాష్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే సినిమాల్లో రాణించాలని సుడిగాలి సుధీర్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇటీవలే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో అలరించిన ఈ జబర్దస్త్ కమెడియన్.. కొత్త ప్లాన్స్‌లో ఉన్నాడని తెలుస్తోంది. అందుకే బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్స్ తగ్గించుకొని వెండితెరపై దృష్టి పెట్టాలనే కోణంలో ఆలోచిస్తున్నాడట. సోలో హీరోగా నటించి తన టాలెంట్ బయటపెట్టాలని చూస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KGb4QQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...