Monday, 27 April 2020

బోయ్‌ఫ్రెండ్ లేకపోవడానికి తమ్ముడే కారణం.. పాపం రకుల్

పేరు చెప్పగానే మనకు అందం, అభినయం, అంతకు మించి ఆమె ఫిట్‌నెస్ గుర్తుకు వస్తాయి. తన సూపర్ ఫిజిక్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ పంజాబీ బ్యూటీ. నిన్నటి మొన్నటి వరకు దక్షిణాదిలో సినిమాలు చేసిన రకుల్ ఇప్పుడు బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అందాలను బాగానే ఆరబోస్తోంది. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ చాలా మంది బోయ్‌ఫ్రెండ్స్‌ను మెయింటైన్ చేస్తుంటారు. కానీ, రకుల్ పాప ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. రానాతో రకుల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు గతంలో రూమర్లు వచ్చాయి. అయితే, వాటిని వీరిద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతానికి అయితే రకుల్ సింగిల్. Also Read: అయితే, రకుల్ ప్రీత్ సింగ్ సింగిల్‌గా ఉండిపోవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ రివీల్ చేసింది. కారణం ఎవరో కాదు.. ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్. మగగాలిని తన అక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా కాపలా కాసేవాడట. ‘‘స్కూల్‌లో నేను అబ్బాయిలతో మాట్లాడితే నా తమ్ముడు మా అమ్మానాన్నలకు ఫిర్యాదు చేసేవాడు. నాకు బాగా గుర్తు.. నేను ఒకసారి భోజనం ప్లేట్ పట్టుకుని ఉన్నాను. నా పక్కన ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు నిలబడ్డారు. దీంతో నేను ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తున్నానని ఇంటికి వెళ్లిన వెంటనే నా తమ్ముడు మా అమ్మానాన్నలతో చెప్పాడు’’ అని తమ్ముడి భాగోతం గురించి చెప్పుకొచ్చింది. Also Read: ఆ దెబ్బతో ఇప్పటి వరకు మగాళ్ల గురించి ఆలోచించడమే మానేసిందట రకుల్. స్కూల్‌లో అబ్బాయిలతో మాట్లాడితేనే అమ్మానాన్నలకు కంప్లయింట్ చేసిన అమన్.. తన అక్క సినిమాల్లో హీరోల పక్కన స్టెప్పులేయడానికి ఎలా ఒప్పుకున్నాడో. ఏదైతే ఏంలే.. మొత్తానికి తమ్ముడి కారణంగా బోయ్‌ఫ్రెండ్‌ను మెయింటైన్ చేయడానికి భయపడుతోంది పాపం రకుల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/357iVQK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...