Saturday, 25 April 2020

శ్రీముఖి, ఉదయభానులపై యాంకర్ లాస్య కామెంట్స్.. వాళ్ళ క్యారెక్టర్స్ బయటపెడుతూ!

యాంకర్ .. బుల్లితెర ప్రేక్షకులకు మరపురాని యాంకర్ ఈమె. ‘సంథింగ్ స్పషల్’ అంటూ రవితో కలిసి అప్పట్లో చిన్నితెరపై రచ్చ రచ్చ చేసిన ఈమె గత కొంతకాలంగా యాంకరింగ్‌కి దూరంగా ఉంటోంది. తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకొని మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత భర్త, బిడ్డతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తూ కెమెరాకు దూరంగా ఉంటున్న లాస్య.. ఇటీవలే మళ్ళీ తెరపై కొన్ని షోస్‌లో అక్కడక్కడా కనిపిస్తోంది. ఇంతలోనే లాక్‌డౌన్ వచ్చేసి బుల్లితెర ప్రోగ్రామ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సంస్థ ఆమెను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ గురించి కామెంట్ చేస్తూనే సీనియర్ యాంకర్స్ సుమ, ఉదయభానుల ప్రస్తావన తీసుకొచ్చింది లాస్య. తనకు మొదటి నుంచే సుమ ఇష్టమని చెప్పిన ఆమె.. ఆ తర్వాత అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఉదయభాను యాంకరింగ్ చేసిన హార్లిక్స్ హృదయాంజలి, వన్స్ మరి ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా చూసేదాన్నని లాస్య చెప్పింది. ఉదయభానును చూసే ఎలా నిలబడాలి? ఎలా యాంకరింగ్ చేయాలి? లాంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని తెలిపింది . అయితే ఎప్పుడైతే తాను ఉదయభానుతో మాట్లాడానో అప్పుడే ఆమె క్యారెక్టర్ ఏంటో తెలిసిందని, ఆమె తనను ఎంతో బాగా రిసీవ్ చేసుకునేదని, ఓ యాంకర్‌గా కంటే పర్సనల్ గానే ఉదయభాను చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది లాస్య. ఇక మరో యాంకర్ శ్రీముఖి గురించి మాట్లాడిన లాస్య.. మొదట్లో శ్రీముఖి తనకు పెద్దగా తెలియదని చెప్పింది. అయితే పటాస్ షోకి వచ్చిన తర్వాత ఆమె ఏంటనేది తెలిసిందని చెప్పుకొచ్చింది. కాస్టింగ్‌లో కూడా శ్రీముఖి ఫటా ఫట్ మాట్లాడేస్తుందని, కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం ఆమె చలాకీతనానికి నిదర్శనం అని చెప్పింది. ఆ అమ్మాయితో పెద్దగా పరిచయం లేకపోయినా ఇటీవల ఉగాది షో చేసిన తర్వాతే.. ఇప్పుడిప్పుడు ఆమె గురించి మెల్లగా తెలుస్తుందని తెలిపింది లాస్య. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/355jZ7D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...