Monday, 6 April 2020

ఐదోసారి కరోనా టెస్ట్.. ఎట్టకేలకు జయించిన సింగర్

బాలీవుడ్ సింగర్ ఎట్టకేలకు కరోనాను జయించింది. మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చిన కనికా కపూర్.. అక్కడి నుంచి కాన్పూర్, లక్నో వెళ్లారు. ఆ తరవాత కనికా దగ్గు, జ్వరంతో బాధపడటంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమెకు కరోనా వైరస్ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను లక్నో నగరంలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ లోని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమెకు నాలుగు సార్లు కరోనా టెస్ట్‌లు చేయించగా.. నాలుగాసార్లు పాటిజివ్ అని తేలడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే ఐదోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇందులో ఆమెకు కరోనా నెగిటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమెకు పాజిటివ్ నుంచి రిపోర్ట్ నెగిటివ్‌కి మారాయని.. మరోమారు పరీక్షించాల్సి ఉందన్నారు. ఆదివారం నాడు మరోసారి పరీక్ష జరిపడంతో ఆమె కరోనా నుండి పూర్తి కోలుకోవడంతో సోమవారం నాడు డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సింగర్ కేసు తొలి నుంచి వివాదంగా మారింది.లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్.. క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీల్లో పాల్గొన్నారు. ఆమె వల్ల చాలా మందకి వైరస్ సోకి ఉంటుందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆమెతోపాటు పార్టీలో పాల్గొన్న ఎవరికీ కరోనా వైరస్ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక కనికా కపూర్‌ హాస్పటల్‌ వ్యవహరించిన తీరుపైన పలు విమర్శలు వచ్చాయి. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు కనికాపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఒక స్టార్‌లా కాకుండా ఒక పేషెంట్‌లా వ్యవహరిస్తే వైద్యం అందించగలమని స్పష్టం చేశారు. ఆమెకు అటాచ్‌డ్ టాయ్‌లెట్, టీవీ, వెంటిలేటర్ సౌకర్యాలతో పాటు.. ఆసుపత్రి కిచెన్ నుంచి గ్లూటెన్ ఫ్రీ డైట్ అందిస్తున్నా ఆమె నుంచి సహకారం అందడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్లు. మొత్తానికి నాలుగుసార్లు పాజిటివ్ వచ్చినా.. ఐదోసారి డాక్టర్ల కృషితో కరోనా నుంచి జయించి ప్రాణాలను దక్కించుకోగలిగారు కనికా కపూర్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V3yiVC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...