Thursday, 23 April 2020

మరో నటికి కొరోనా పాజిటివ్.. ఆమె రియాక్షన్ ఏంటంటే!

ప్రపంచాన్నే కుదిపేస్తున్న వైరస్ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా రోజు రోజుకూ ఈ వైరస్ తీవ్రత పెరుగుతుండటం అందరిలో భయాందోళనలు నింపుతోంది. పేద, ధనిక, సాధారణ వ్యక్తి, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ఈ వైరస్ ప్రతీ ఒక్కరినీ కాటేస్తోంది. ఇప్పటికే కొందరు సినీ నటులు కరోనా బారిన పడగా, తాజాగా ఆ లిస్టులో చేరింది స్పానిష్ నటి . నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే మనీ హీస్ట్‌లో కీలక పాత్ర పోషించి ఫేమస్ అయింది ఇజియార్ ఇతునో. ఆమె కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఈ విషయమై రియాక్ట్ అయిన ఇజియార్ ఇతునో.. కరోనా వ్యాధిని అంత తేలిగ్గా తీసుకోని ప్రాణాలు పణంగా పెట్టుకోవద్దని చెప్పింది. గత శుక్రవారం నుంచి తనలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పింది. అయితే తనలో కరోనా తీవ్రత ఎక్కువగా లేదని, ఈ ప్రాణాంతక వ్యాధికి ముగింపు ఎప్పుడనేది అర్థం కావడం లేదని ఆమె పేర్కొంది. గతంలో సింగర్ కనికా కరోనాతో పోరాడి చివరకు నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత పలువురు విదేశీ నటులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. టామ్ హాంక్స్, రీటా విల్సన్ లాంటి హాలీవుడ్ నటుడు కరోనా బారిన పడగా ఇప్పుడు ఇజియార్ ఇతునో ఆ లిస్టులో చేరింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yCLj0Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...