వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25 సినిమాలు చేశాక పొలిటికల్ బాట పట్టిన సంగతి తెలిసిందే. 'జనసేన' పేరుతో పార్టీ ప్రారంభించిన ఆయన జనాలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంతో పోరాడుతున్నారు. అవినీతి రహిత సమాజం చూడాలన్నదే లక్ష్యంగా సాగిపోతున్నారు. అయితే తాజాగా పవన్ పొలిటికల్ ప్రయాణంపై నాగబాబు కూతురు, మెగా డాటర్ ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన నిహారిక.. పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూల్లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయాలతో పాటు కుటుంబ విషయాలను పంచుకుంటోంది. మరోవైపు సామజిక మాధ్యమాల్లోనూ చురుకుగా ఉంటూ నెటిజన్లతో చిట్‌ఛాట్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చిన నిహారిక, బాబాయ్ పవన్ కళ్యాణ్ నైజం గురించి చెప్పుకొచ్చింది. పవన్ బాబాయ్ ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడని, ఆయన మితభాషి అని చెప్పింది నిహారిక. ఎప్పుడూ కామ్‌గా ఏదో ఒక పుస్తకం చదువుతూ తన లోకంలో తానుండే బాబాయ్.. రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని వేలమంది ఎదురుగా వేదికపై అలుపెరగని ప్రసంగాలు చేయడం చూసి తాను ఆశ్చర్యపోతుంటానని తెలిపింది. బాబాయ్ మనసు వెన్న అని, అలాగే ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి అని చెప్పింది. రాజకీయాల్లో అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకొచ్చింది నిహారిక. ఆమె చేసిన ఈ కామెంట్స్ చూసి అటు మెగా అభిమానులు ఇటు జన సైనికులు ఖుషీ అవుతున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xXiHiU
v
No comments:
Post a Comment