Monday, 6 April 2020

తమ్మారెడ్డి భరద్వాజ ఇంట విషాదం.. పరామర్శించిన చిరంజీవి

ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కృష్ణవేణి సోమవారం మృతిచెందారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు తుదిశ్వాస విడిచారు. తన తల్లి కన్నుమూసినట్టు తమ్మారెడ్డి భరద్వాజ సినీ పరిశ్రమలో ఉన్నవారికి, మీడియాకు వెల్లడించారు. వృద్ధాప్యం కారణంగా తన తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం విషమించడంతో సోమవారం కన్నుమూశారని భరద్వాజ తెలిపారు. తన తల్లి మరణవార్త తెలిసి మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని.. అయితే, కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించేందుకు ఇంటికి ఎవరూ రావద్దని కోరారు. కాగా, మాతృ వియోగంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న భరద్వాజను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఫోన్ ద్వారా భరద్వాజను పరామర్శించిన చిరంజీవి.. ఆయనకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ, చిరంజీవి కలిసి సినీ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేసి విరాళాలు సేకరించి సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేస్తున్నారు. Also Read: ప్రస్తుతం లాక్‌డౌన్ పీరియడ్ నడుస్తుండటంతో తన తల్లి అంత్యక్రియలను కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే, తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా నిర్మాత అనే సంగతి తెలిసిందే. రవీంద్ర ఆర్ట్స్‌ పతాకంపై ‘లక్షాధికారి’, ‘జమీందారు’, ‘బంగారు గాజులు’, ‘ధర్మదాత’, ‘దత్త పుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’ వంటి హిట్‌ చిత్రాలను ఆయన నిర్మించారు. కృష్ణమూర్తి 2013లో మృతిచెందారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39T9tkQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...