Friday, 3 April 2020

70 ఏళ్ల వయసులో వర్కౌట్స్.. తండ్రిపై హృతిక్ రోషన్ ప్రశంసలు

సెల్ఫ్ క్వారంటైన్ సమయంలో ఫిట్‌గా, పాజిటివ్‌గా ఉండటం ఎంతో ఉత్తమం. అవే మనల్ని జబ్బుల నుంచి కాపాడతాయి. వాటిని మన ధరికి చేరనివ్వకుండా రక్షిస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్ అదే చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి వర్కౌట్స్ చేస్తున్నారు. ఇంట్లో రాకేష్ రోషన్ వర్కౌట్స్ చేస్తో్న్న వీడియోను ఆయన కుమారుడు, హీరో హృతిక్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తండ్రి సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ‘‘అదీ మా నాన్నంటే. ఎప్పటికీ ఆయన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోరు. ఇలాంటి దృఢ సంకల్పం మనందరం ఇలాంటి సమయంలో పోరాడటానికి అవసరం. ఏ ఏడాది ఆయన 71వ సంత్సరంలోకి అడుగుపెడతారు. రోజుకి రెండు గంటల పాటు ఆయన వ్యాయామం చేస్తారు. కిందటేడాది ఆయన క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడ్డారు. వైరస్ కూడా ఆయన్ని చూసి భయపడుతుందని నేను భావిస్తున్నాను. చాలా చాలా భయపడుతుంది’’ అని హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. కాగా, రాకేష్ రోషన్‌కు గొంతు క్యాన్సర్ ఉన్నట్టు తొలి దశలోనే గుర్తించారు. 2018 డిసెంబర్‌లో ఆయన చికిత్స చేశారు. శస్త్ర చికిత్స అనంతరం ఆయన క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే, రాకేష్ రోషన్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా కుమారుడు హృతిక్ రోషన్‌తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి అతన్ని బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌ని చేశారు. ఈ తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో ‘కొయీ మిల్ గయా’, ‘కహో నా ప్యార్ హై’, ‘క్రిష్’ వంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు వచ్చాయి. రాకేష్ రోషన్ చివరిగా నిర్మించిన చిత్రం ‘కాబిల్’. ఇందులోనూ హృతిక్ హీరో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aJX1Vu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...