Friday, 13 March 2020

RRR: బాప్ రే! రామ్ చరణ్.. లుంగీతో కండలు తిరిగి నా సామిరంగా!

మెగా పవర్ స్టార్ లుక్ చూశారా.. ఎలా ఉందో? కండలు తిరిగిన దేహంతో కొండనైనా పిండి చేసేలా.. మెడలో రుద్రాక్షల దండ వేసుకుని ఉగ్ర నరసింహుడిలా కనిపిస్తున్నారు. వారెవ్వా.. ఆ షార్ట్ ఆర్మీ కటింగ్, లైట్ ట్రిమ్ గెడ్డం, పసుపు రంగు లుంగీలో ఏమైనా ఉన్నాడా.. చెర్రీ?? ఎంతైనా రాజమౌళి చేతిలో పడితే రాటుదేలు పోతుంటారు ఎవరైనా.. ఆ ప్రభాస్, రానాలకు కూడా అలాగే చేశారు.. కండలు తిరిగిన ధీరుడిలా చేసేస్తాడు జక్కన్న. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు కాబట్టి.. ఈ సర్ ప్రైజ్ లుక్ ఆ సినిమాలోదే అనుకోవచ్చు. కాని ఈ ఫొటో వెనుక ఉన్న కథ వేరే. ఇది రాజమౌళి చెక్కిన కండల శిల్పం కాదు. ఓ సాదాసీదా ఫ్యాన్ క్రియేట్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్. అవును.. రామ్ చరణ్ తేజ్‌ను తాను ఎలాగైతే చూడాలని అనుకుంటున్నాడో ఆ లుక్‌లో ఫొటో షాప్ చేసి ఈ కండల రామ్ చరణ్‌ని తయారు చేశాడు ఓ ఫ్యాన్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అన్నా.. ఈ లుక్‌లో ఒక సినిమా రావాలి.. వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం పక్కా’ అంటూ ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ వదిలారు ఓ అభిమాని. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ ఫేస్ తప్పితే.. హెయిర్, బాడీ మొత్తం కూడా ఒరిజినల్ కాదు. ఒక్కో హీరో నుండి ఒక్కో పార్ట్‌ను తీసుకుని ఇలా కండల వీరుడిగా పోస్టర్ తయారుచేశాడు. అయితే రామ్ చరణ్ ఫిజిక్‌కి ఏదైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయో వాటినే తీసుకున్నాడు ఆ ఫ్యాన్. దీంతో చెర్రీ ఫేస్‌కి ఆ సిక్స్ ప్యాక్ బాడీ, హెయిర్ కట్, లుంగీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్.. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఈయన అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా బాలీవుడ్ భామ ఆలియా భట్ చరణ్‌కి జోడీగా నటిస్తోంది. కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తుండగా.. అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. ఈ చిత్రానికి ‘రఘుపతి రాఘవ రాజారాం’ టైటిల్ ప్రచారంలో ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TNKMRZ
v

No comments:

Post a Comment