Thursday, 26 March 2020

ప్చ్! RRR వీడియో 4 గంటలకు.. ట్విట్టర్‌లో ఫైటింగ్, జక్కన్నపై ఫైరింగ్

మొత్తానికి రాజమౌళి మాట తప్పారు.. బర్త్ డే సందర్భంగా నేడు (మార్చి 27)న స్పెషల్ వీడియో విడుదల చేస్తామని అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కోట్లాది మంది ప్రేక్షకులు ఈ వీడియో కోసం వేచి చూడగా.. 11.15 నిమిషాలకు జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు పక్కాగా విడుదల చేస్తాం అని ట్వీట్ చేశారు. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే బండబూతులు తిడుతూ.. కరెక్ట్ టైంకి ఇవ్వలేనప్పుడు అనౌన్స్ చేయడం ఎందుకు? ప్రీ పబ్లిసిటీ కోసం ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ ట్విట్టర్‌లో ట్వీట్ వార్ నడుస్తోంది. ‘‘సోదర రామ్ చరణ్, మంచి పరిస్థితుల్లో నీ పుట్టినరోజును జరుపుకోవాలని నేను భావించాను. కానీ, ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఎందుకంటే, ఇంటిలో ఉండటమే ఇప్పుడు ముఖ్యం. రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఇది నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతి అవుతుంది. రామరాజు కోసం భీమ్’’ అంటూ గురువారం నాడు ఎన్టీఆర్ పోస్ట్ పెట్టడంతో రామ్ కోసం భీమ్ ఇస్తున్న సర్ ప్రైజ్ గిఫ్ట్ కోసం కోట్ల మంది అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూశారు. ఇక రామ్ చరణ్ సైతం ‘‘వాహ్! నేను సరైన సమయంలో ట్విట్టర్‌లో చేరానని అనుకుంటున్నాను. లేదంటే నీ సర్‌ప్రైజ్ మిస్ అయ్యేవాడిని సోదర. రేపటి కోసం వేచిచూడలేక పోతున్నాను’ అని రిప్లై ఇవ్వడంతో రామ్ చరణే కాదు.. చాలా మంది ప్రేక్షకుల రామరాజు స్పెషల్ వీడియో కోసం ఎదురుచూశారు. అయితే 4 తరువాతే రామ్ చరణ్ వీడియో అని ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో నిరాశకు గురయ్యారు సినీ ప్రేక్షకులు డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, చ‌ర‌ణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xvrzvK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...