ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామల జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. అలాగే డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా వారికి సంఘీభావ సంకేతంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చప్పట్ల ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. “కరోనా కష్టాన్ని ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ అనే పిలుపు తారకమంత్రంగా పని చేసింది. ఈ కార్యక్రమంతో ప్రజలలో కరోనా పట్ల పూర్తి అవగాహన వచ్చింది’’ అని అన్నారు. సెల్ఫ్ క్వారంటైన్లో ప్రభాస్ జార్జియా షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన ప్రభాస్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కృష్ణంరాజు ధ్రువీకరించారు. ప్రభాస్‌తో పాటు ఆయన చెల్లెలు సాయి ప్రసీద (కృష్ణంరాజు పెద్ద కుమార్తె) కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. ఆమె ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. Also Read: ‘‘విదేశాల నుండి వచ్చిన వారు వారికి ఎలాంటి అస్వస్థత లేకపోయినప్పటికీ ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి స్వచ్ఛంద గృహనిర్బంధంలోకి వెళ్ళటం వారి బాధ్యత. వారి కుటుంబ సభ్యులు కూడా ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించాలి. మా అబ్బాయి ప్రభాస్, అమ్మాయి సాయి ప్రసీద విదేశాల నుండి వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం అందజేసి సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు’’ అని తెలియజేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J3dOXs
v
No comments:
Post a Comment