Tuesday, 10 March 2020

ఫ్యామిలీతో ఎన్టీఆర్ హోలీ సెలబ్రేషన్స్.. జూనియర్ రామ్‌లతో సీనియర్ రామ్

యంగ్ టైగర్ హోలీ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ హోలీ శుభాకాంక్షల్ని తెలియజేశారు ఎన్టీఆర్. వైట్ అండ్ వైడ్ డ్రెస్‌లో ముఖానికి రంగులు పూసుకుని ఫ్యామిలీతో కలిసి రంగుల హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యామిలీ స‌భ్యులు అంద‌రు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం చూసిన ఫ్యాన్స్ ఈ ఫొటోను లైక్స్ అండ్ రీ ట్వీట్‌లతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పిల్లలు చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. చిన్న కుమారుడు భార్గవ్ రామ్ బొద్దుగా ముద్దుగా చిన్నప్పుడు ఎన్టీఆర్ ఎలాగైతే ఉండేవారో సేమ్ టు సేమ్ అలాగే ఉండి సర్ ప్రైజ్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్‌కి సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తుండగా.. తాజాగా షేర్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్‌ లుక్‌కి సంబంధించి పెద్దగా మేకోవర్ కనిపించడంలేదు.. కాస్త సన్నబడినట్టుగా కనిపిస్తూ ఒరిజినల్ హెయిర్ కట్‌తో దర్శనం ఇచ్చారు ఎన్టీఆర్. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా హాలీవుడ్ భామ ఓలివియా మోరిస్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2W1pJNo
v

No comments:

Post a Comment