Wednesday, 11 March 2020

మూడు రోజులుగా ఆల్కహాల్... కిక్ లేదంటున్న కాజల్

తెలుగు హీరోయిన్లలో అందమైన చందమామ ఎవరంటే ... ఎవరికైనా టక్కున గుర్తుకు వచ్చే పేరు హీరోయిన్ . పెద్ద పెద్ద కళ్లతో... అందమైన నవ్వుతో కుర్రకారును కట్టిపడేస్తోంది. నందమూరి హీరోయిన్ ‘లక్ష్మీ కల్యాణం’సినిమాతో టాలీవుడ్ తెరపై మెరిసింది ఈ ముద్దుగుమ్మ. చందమామ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో... టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం. 150లో కూడా కాజలే హీరోయిన్. సోషల్ మీడియాలో కూడా ఈ భామ భలే యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతీ అంశంపై స్పందిస్తూ ఉంటుంది. అయితే కాజల్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల పోస్టుల్ని చూస్తున్న కాజల్... తన పేజీలో కూడా కొన్ని పోస్టుల్ని పెట్టింది. ‘గతమూడురోజులుగా విపరీతమైన ఆల్కహాల్ తీసుకుంటున్నా... అందుకు నా చేతులే సాక్ష్యం.. కానీ లివర్ మాత్రం క్షేమంగా ఉంది’అనే పోస్టును చేసింది. దీంతో పాటు మరో పోస్టును కూడా పెట్టింది. ‘ఇప్పుడేం ఏం చేస్తే మంచిదని స్టాక్ బ్రోకర్‌ను అడిగితే... దైవ నామస్మరణ అని ఆయన జవాబు చెప్పాడు’ అనే ట్వీట్ కూడా కాజల్ చేసింది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో అందరూ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండే శానిటైజర్స్ వాడుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది తమ చేతులు ఆల్కహాల్‌ తీసుకుంటున్నా... లివర్ మాత్రం క్షేమంగానే ఉందంటూ... పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టును కాజల్ కూడా ఎవరి దగ్గరో కాపీ కొట్టి పోస్టు చేసింది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలుతున్న విషయం తెలిసందే. అందుకే.. స్టాక్ బ్రోకర్లు కూడా ఈ సమయంలో దైవనామస్మరణ మంచిదని చెబుతున్నారని కాజల్ అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. మొత్తంమీద కరోనా పోస్టులతో మరోసారి ఈ ముద్దుగుమ్మ వార్తాల్లో నిలిచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2w2oNxk
v

No comments:

Post a Comment