యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు . ‘నువ్వే నువ్వే’, ‘సంతోషం’ లాంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇండస్ట్రీలో చౌదరీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అన్నవిషయంపై అనిత మండిపడ్డారు. అంత సీనేమీ లేదని, తన పేరు వెనక చౌదరి అని ఉన్నా తనకు బెనిఫిట్ ఏమీ లేదని వాపోయారు. యాంకరింగ్ చేస్తున్నప్పుడు తన చేత కుక్క చాకిరీ చేయించుకున్నారని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ‘‘ఇండస్ట్రీలో చౌదరిలకే అవకాశాలు ఇస్తారు అనడంలో వాస్తవం లేదు. నా పేరు అనితా చౌదరి. కానీ నా చేత కుక్క చాకిరీ చేయించుకున్నారు. ఆఫీస్ బాయ్‌కి ఎక్కువ యాంకర్‌కి తక్కువ అన్నట్లు చూసారు నన్ను. నేను ఈటీవీలో ఓ ప్రోగ్రామ్ చేస్తుంటే నా పేరును అనితా చౌదరిగా వేసేసారు. నేను చౌదరి అన్న పేరు తీసేయమని చెప్పాను. కానీ వాళ్లు వినిపించుకోలేదు. ఫర్వాలేదులెండి ఎటూ వేసేసాంగా తీయడం ఎందుకు అన్నారు. అదీకాకుండా అప్పట్లో అనిత పేరుతో చాలా మంది ఉన్నారు. దాంతో అనితా చౌదరి అనే ఉంచేసుకున్నాను. కులం వల్ల మగవాళ్లకు లాభం కలిగిందేమో కానీ మాకు మాత్రం కులం వల్ల ఎలాంటి లాభాలు జరగలేదు. అయితే నాకు సుమ, ఝాన్సీ, ఉదయభానులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి" READ ALSO: " ఇప్పుడు పిల్లలు పెద్దవారు అవుతుండడం వల్ల మాకు వీలు పడటంలేదు కానీ. తరచూ కలుస్తూనే ఉంటాం. నాకు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉంది. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో కలిసి పనిచేసాను. నాగేశ్వరరావుగారికి ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవ్వరికీ లేదు. నాపై తెగ జోకులు వేసేవాళ్లు. ఆయన నటిస్తున్న ఓ సినిమాలో నేను నటిస్తుంటే.. ‘ఈ అమ్మాయిని నాకు మేనకోడలిగా పెట్టొచ్చు కదయ్యా’ అనేవారు. అది నాకు కాంప్లిమెంట్. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను జబర్దస్త్‌లాంటి ప్రోగ్రామ్‌తో పోల్చద్దు. నాకు నాగార్జునగారితో కూడా అంతే చనువు ఉంది. మీ తర్వాతి సినిమాలో నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన్ని నేరుగా వెళ్లి అడగగలను. నాగచైతన్యతో అంత చనువు లేదు. ఎందుకంటే అతనితో నేను ఒక్క సినిమానే చేసాను’ అని తెలిపారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2W8mow3
v
No comments:
Post a Comment